Zodiac signs: ఈ రాశులపై కుబేరుడి అనుగ్రహం.. వీరికి డబ్బు కొరతే ఉండదు..!

Published : Jul 05, 2025, 05:05 PM IST

యక్ష రాజు కుబేరుడు కొన్ని రాశుల పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటాడు. ముఖ్యంగా నాలుగు రాశుల వారిపై కుబేరుడి దయ, అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది.

PREV
15
కుబేరుడి అనుగ్రహం ఉన్న రాశులు

జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా.. ఆనందంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. డబ్బు సంపాదించాలి అంటే.. మనం శ్రమించడంతో పాటు.. లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉండాలి అని నమ్ముతుంటారు. లక్ష్మీ కటాక్షం మాత్రమే కాదు..కుబేరుడి అనుగ్రహం కూడా కచ్చితంగా ఉండాలి. ఆయన అనుగ్రహం పొందిన వ్యక్తికి జీవితంలో డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు. జోతిష్యశాస్త్రంలో కొన్ని రాశులంటే కుబేరుడికి అమితమైన అభిమానం ఉంటుంది. యక్ష రాజు కుబేరుడు కొన్ని రాశుల పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటాడు. ముఖ్యంగా నాలుగు రాశుల వారిపై కుబేరుడి దయ, అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వారికి అన్ని వైపుల నుంచి విజయం లభిస్తుంది. జీవితంలో కచ్చితంగా ధనవంతులు అవుతారు. మరి, ఆ రాశులేంటో చూద్దామా...

25
1.వృషభ రాశి..

వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులపై సంపదకు దేవుడైన కుబేరుడి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. కుబేరుడికి వృషభ రాశి అంటే అభిమానం కాస్త ఎక్కువ. అందుకే, ఈ రాశిలో జన్మించిన వారికి డబ్బు కొరత ఎప్పుడూ రాదు. వీరు కొంచెం ప్రయత్నించినా సరే, శుభ ఫలితాలు అందుకుంటారు. వీరు ఏ రంగంలో అడుగు పెడితే.. ఆ రంగంలో విజయం సాధించగలరు. వీరికి జీవితంలో అన్ని ఆనందాలు లభిస్తాయి. భౌతిక సుఖాలకు కొదవలేదు.

35
2.కర్కాటక రాశి..

కుబేరుడు కి ఇష్టమైన మరో రాశి కర్కాటక రాశి. వీరిపై కుబేరుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కుబేరుని అనుగ్రహం కారణంగా.. కర్కాటక రాశివారు సంపద, శ్రేయస్సు పొందుతారు. ఈ రాశివారికి కుటుంబంపై ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. వారి కోసం వీరు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కుబేరుని అనుగ్రహం కారణంగా వీరికి సమాజంలో గౌరవ, మర్యాదలు లభిస్తాయి.

45
3.తుల రాశి..

తులా రాశి కుబేరుడికి ఇష్టమైన రాశిచక్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. తుల రాశి వారికి కుబేరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. దీని కారణంగా, ఈ వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ వ్యక్తులు తాము చేయాలని నిర్ణయించుకున్న ఏ పనిని అయినా పూర్తి చేస్తారు. ఈ అలవాటు వారిని జీవితంలో విజయవంతం చేస్తుంది.

55
4.ధనస్సు రాశి..

ధనుస్సు రాశి కుబేరుడికి ఇష్టమైన రాశులలో ఒకటి. ఈ రాశి వారిపై కుబేరుడు తన ప్రత్యేక అనుగ్రహాన్ని ఉంచుతాడు. ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారు. ఆ పనికి తగిలిన ఫలితం వారికి సంపద రూపంలో వస్తుంది. వీరు తమ కోసమే కాకుండా.. తమ తరవాతి తరాల కోసం కూడా డబ్బు కూడపెడతారు. ఆ సంపద మొత్తాన్ని నిజాయితీగా సంపాదిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories