ఈ మూడు రాశులకు దీపావళి తర్వాత అదృష్టం, శని అనుగ్రహంతో ఏ రాశికి ఎలా ఉందంటే?

Published : Oct 03, 2025, 06:30 AM IST

దీపావళి తరువాత ఓ మూడు రాశులకు అదృష్టంయోగం ఉందా..? శని అనుగ్రహం వల్ల ఆ రాశుల వారికి జరిగే శుభం ఏంటి? వారి జీవితంలో జరిగే మార్పులు ఏంటి? ఈ విషయంలో జ్యోతిషులు ఏమంటున్నారు. 

PREV
15
శనిదేవుడు కర్మఫల ప్రదాత

జ్యోతిషశాస్త్రం ప్రకారం శనిదేవుడు న్యాయదేవతగా, కర్మఫల ప్రదాతగా పరిగణించబడతాడు. శని రాశి మారినప్పుడు ప్రతీ వ్యక్తి జీవితంలో కీలకమైన మార్పులు చోటుచేసుకోవడం సహజం. ప్రస్తుతం శని కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉండగా, వచ్చే నవంబర్ 28న శని రాశి మార్పు జరుగనుంది. ఆ తేదీ నుంచి శని మళ్లీ తన నైజమైన గమనానికి పూనుకుంటాడు. ఈ మార్పు పన్నెండు రాశులపై ప్రభావం చూపనుంది. అయితే, ప్రముఖ జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పుతో వృషభం, మకరం, కుంభ రాశుల వారికి శని అనుగ్రహం అధికంగా లభించనుంది.

25
వృషభ రాశి (Taurus)

వృషభరాశి వారికి ఇది ఒక అద్భుతమైన కాలంగా ఉండబోతోంది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, గౌరవం లభించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, పెట్టుబడులు లభించవచ్చు. ఆర్థికంగా బలపడటంతో పాటు, వ్యక్తిగత జీవితంలో సంతోషం కూడా చేకూరుతుంది.

35
మకర రాశి (Capricorn)

శని మార్పు కారణంగా మకరరాశి వారికి కర్మ ఫలితాలు వెంటనే లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతస్థాయికి ఎదిగే మార్గం ఏర్పడుతుంది. వ్యాపారవేత్తలకు పెట్టుబడులపై లాభదాయక ఫలితాలు దక్కుతాయి. ఈ సమయంలో చేసే శ్రమ పూర్తిగా ఫలిస్తుంది. ఆర్థిక స్థిరత్వం, విజయదశ ప్రారంభమవుతుందని జ్యోతిష్కులు విశ్లేషిస్తున్నారు.

45
కుంభ రాశి (Aquarius)

కుంభరాశి వారికి ఈ మార్పు వల్ల సామాజిక గౌరవం, కుటుంబ ఆనందం లభించనున్నాయి. కెరీర్‌లో కొత్త అవకాశాలు, నిలిచిపోయిన పనుల పూర్తి కావడం, వ్యాపార ఒప్పందాల సాధన జరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో కుటుంబ బంధాలు బలపడతాయి. విజయాలు వరుసగా రావచ్చని పండితులు అభిప్రాయపడుతున్నారు.

55
దీపావళి తరువాత అదృష్టం

నవంబర్ 28న శని కదలిక ప్రారంభం కావడం వల్ల మొత్తం పన్నెండు రాశులపైనా ప్రభావం ఉండే అవకాశం ఉన్నా, వృషభం, మకరం, కుంభరాశుల వారికి ఇది అదృష్ట ద్వారాలు తెరిచే సమయంగా మారబోతోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం, సమాజంలో గౌరవం వంటి అంశాలలో వారికి శుభప్రభావం ఉంటుంది. దీపావళి తర్వాత ప్రారంభమయ్యే ఈ కాలం, ఈ మూడు రాశులవారికి కొత్త ఆశలు, విజయాల దిశగా తీసుకెళ్లనున్నది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన వివరాలు జ్యోతీష్యులుచెప్పిన సాధారణ సమాచారం ప్రకారం అందించబడింది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని గ‌మ‌నించాలి.

Read more Photos on
click me!

Recommended Stories