మీన రాశి వారి ఎనిమిదో ఇంట్లో ఈ చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల మీనరాశి వారు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆఫీసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు వ్యతిరేకంగా కుట్రలు జరిగే అవకాశం ఉంది. ఆ కుట్రల వల్ల ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది. పెట్టుబడులు కూడా నష్టపోవచ్చు. వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం జ్యోతిష్య అభిప్రాయాలు, మత గ్రంథాలు, పంచాంగం ఆధారంగా ఇచ్చాం. ఏషియానెట్ న్యూస్ దీన్ని ధృవీకరించలేదు. సమాచారాన్ని అందించడం మాత్రమే మా ఉద్దేశం. దీని కచ్చితత్వం, విశ్వసనీయత, ఫలితాలకు ఏషియానెట్ న్యూస్ ఎలాంటి బాధ్యత వహించదు)