2.కుంభ రాశి...
నవరాత్రి తర్వాత కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుంభ రాశి రెండవ ఇంట్లో విష యోగం ఏర్పడుతుంది. ఇది కుంభ రాశి వారిపై అశుభ ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి, పని అసంపూర్ణంగా ఉంటుంది. పని మొదలు పెట్టినా.. మధ్యలోనే ఆపేస్తారు. దీని కారణంగా, ఒత్తిడి, అశాంతి వచ్చే అవకాశం ఉంది. చేసిన పని నుండి డబ్బు సంపాదించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ సమయంలో, మీరు ఓపికగా , జాగ్రత్తగా పని చేయాలి. అలాగే, ఈ సమయంలో శత్రువుల ముప్పు పెరుగుతుంది. ఈ సమస్యలన్నింటినీ తగ్గించడానికి, ఈ సమయంలో ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఆంజనేయుడిని ప్రార్థించండి. ఇది శని ప్రభావాన్ని తగ్గిస్తుంది.