జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాధాన్యం ఉంది. న్యాయ దేవుడు శని 27 సంవత్సరాల తర్వాత గురు గృహానికి సంబంధించిన నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దానివల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆ రాశులేంటో చూద్దామా…
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు ప్రస్తుతం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ నెల 3వ తేదీన ఈ నక్షత్రాన్ని విడిచి పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దేవతల గురువైన బృహస్పతి ఈ నక్షత్రానికి అధిపతి. పూర్వాభాద్ర నక్షత్రంలో శని, గురువుల కలయిక వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. డబ్బు, పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఉంది. మరి శని సంచారం ఏ రాశులవారికి శుభ ఫలితాలను ఇవ్వనుందో ఇక్కడ తెలుసుకుందాం.
24
మిథున రాశి
మిథున రాశివారికి శని నక్షత్ర మార్పు శుభప్రదం. గురు-శని ఆశీస్సులతో ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతలు దక్కవచ్చు. నిరుద్యోగ యువతకు మంచి జీతంతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుంచి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు అనుకున్న స్థాయిలో రాణిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు, కొన్ని బంధాలు కెరీర్‌కు సహాయపడతాయి.
34
తుల రాశి
శని నక్షత్ర మార్పు తుల రాశివారి జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఊహించని శుభవార్తలు వింటారు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి జీతంతో ఉద్యోగం వస్తుంది. నూతన వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలు కురిపిస్తాయి. బంధువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.
కుంభ రాశివారికి అక్టోబర్‌లో స్వర్ణయుగం ప్రారంభం కావచ్చు. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపుడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త ఇంటి నిర్మాణం చేపడుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులను చకచకా పూర్తి చేస్తారు. స్థిరాస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.