Sun Saturn Yoga: రాఖీ పండగ తర్వాత ఈ ఐదు రాశులకు ఊహించని లాభాలు..!

Published : Aug 05, 2025, 10:55 AM IST

ఈ నవ పంచమి యోగం ఫలితాలు 2025 చివరి వరకు ఉండనున్నాయి. ఈ ఫలితాల కారణంగా ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి.

PREV
17
Sun Saturn Yoga

రక్షా బంధన్ వచ్చేస్తోంది. ఈ పండగ కోసం రోజున అమ్మాయిలంతా తమ సోరుడికి రాఖీ కట్టి, తమ ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. అయితే.. ఈ రాఖీ పండగ ఐదు రాశుల వారికి ఊహించని ప్రయోజాలను మోసుకురానుంది. ఎందుకంటే, రక్షా బంధన్ రోజున గ్రహాలలో మార్పులు జరగనున్నాయి. ఆగస్టు 9వ తేదీన గ్రహాల రాజు అయిన సూర్యుడు, న్యాయ దేవుడు శని అరుదైన కలయిక ఏర్పడనుంది. ఇది నవ పంచమ యోగాన్ని సృష్టిస్తుంది. మరి, ఈ యోగం ఏయే రాశులకు మేలు చేయనుందో చూద్దామా..

27
2025 చివరి వరకు

ఈ నవ పంచమి యోగం ఫలితాలు 2025 చివరి వరకు ఉండనున్నాయి. ఈ ఫలితాల కారణంగా ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఇల్లు లేదా వాహనం కొనాలనే కోరిక నెరవేరుతుంది. జోతిష్య శాస్త్రంలో సూర్యుడు, శని రెండూ శక్తివంతమైన, ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణిస్తారు. వాటి కదలిక, స్థానం వ్యక్తుల వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయి. సూర్య దేవుడు శనికి తండ్రి. ఈ రెండింటి కలయిక.. జీవితంలో ఊహించని ప్రయోజనాలను కలిగిస్తుంది. ఏ రంగంలో అయినా కచ్చితంగా విజయం సాధిస్తారు.

37
1.మేష రాశి...

రక్షా బంధన్ 2025 సమయంలో సూర్యుడు-శని ద్వారా ఏర్పడిన నవ పంచమ యోగం మేష రాశివారికి చాలా శుభప్రదంగా మారనుంది. శని మేష రాశివారికి 12, 13 ఇళ్ల్లో ఉంటుంది. కానీ, ఈ కాలంలో శని తిరోగమనం ఉన్నందున.. ప్రతికూల ప్రభావాల నుంచి శాంతి లభిస్తుంది. జీవితంలో తలెత్తే అన్ని సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో మీరు, ఊహించని ఖర్చులను కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించగలరు. ఈ కాలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు వివిధ కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తారు.

47
మిథున రాశి..

సూర్యుడు-శని కలయిక వల్ల ఏర్పడిన నవ పంచమ యోగం ఈ రాశికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో శని తిరోగమనంలో ఉంటుంది. దీని కారణంగా కార్యాలయంలో వివిధ మార్పులు జరగవచ్చు. మీ ఉన్నతాధికారులు , సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులో ఉండవచ్చు. చాలా కాలంగా జరగకుండా ఆగిపోయిన ఏదైనా పని ఉంటే.. అది ఈ కాలంలో పూర్తవుతుంది. డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది, ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. విదేశీ పర్యటనల నుండి ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది.

57
సింహ రాశి..

రక్షా బంధన్ రోజున ఏర్పడిన శుభ యోగం కారణంగా, సింహ రాశి వారు జ్ఞానులు అవుతారు. వారు తమ జ్ఞానంతో అందరినీ ఆకట్టుకుంటారు. సొంత వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. మీరు తల్లిదండ్రులు లేదా పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే, ఈ సమస్య తొలగిపోతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి , శ్రేయస్సు ఉంటుంది. డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ప్రతి పనిలో మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. శని అనుగ్రహంతో, మీ వ్యక్తిత్వం బలపడుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

67
కన్యా రాశి..

రక్షా బంధన్ సమయంలో, నవ పంచమ యోగం కారణంగా, కన్య రాశి వారికి అడుగడుగునా అదృష్టం లభిస్తుంది. వారి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. పనిచేసే వ్యక్తులు తమ ఉన్నతాధికారులతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. వారు తమ లక్ష్యాలన్నింటినీ సులభంగా సాధించగలుగుతారు. మీరు ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకుంటే, ఈ యోగం శుభ ప్రభావం వల్ల మీ కోరిక నెరవేరుతుంది. ఈ కాలం కన్య రాశి వారి ఆరోగ్యానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి.

77
మీన రాశి..

ఈ రాశి వారికి నవ పంచమ యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. వారి నిలిచిపోయిన పనులన్నింటినీ ఇప్పుడు తిరిగి ప్రారంభించవచ్చు. ఈ సమయంలో మీన రాశివారికి నెగిటివ్ ప్రభావాలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. తమ కష్టానికి కావలసిన ఫలితాలను పొందుతారు. అలాగే, వ్యాపారవేత్తలు వివిధ వ్యాపారాల నుండి భారీ లాభాలను ఆర్జిస్తారు. ఎటువంటి అడ్డంకులు లేకుండా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలరు. ఈ కాలంలో, వారు డబ్బు, పిల్లల జీవితం, కుటుంబం , ఆరోగ్యం గురించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశాల నుండి విజయం సాధించే అవకాశం ఉంది, మీ ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories