Zodiac sign: జూలై 13 నుంచి శ‌ని తిరోగ‌మ‌నం.. ఈ రాశుల వారి జీవితంలో ఊహించ‌ని మార్పులు

Published : Jul 13, 2025, 12:17 PM IST

న్యాయం, క‌ర్మ‌ల‌కు శ‌నిదేవుడిని అధిప‌తిగా శాస్త్రం చెబుతుంది. అత్యంత నెమ్మ‌దిగా ప్ర‌యాణించే శ‌ని గ్ర‌హ ప్ర‌భావం మ‌న జీవితాల‌పై ఉంటుంద‌ని విశ్వాసం. కాగా నేడు (ఆదివారం) శ‌ని తిరోమ‌నంలోకి వెళ్తాడు. దీంతో కొన్ని రాశుల‌పై ప్ర‌భావం ప‌డ‌నుంది. 

PREV
18
మీన రాశిలో తిరోగ‌మ‌నం

జూలై 13న శని దేవుడు మీన రాశిలో తిరోగమనంలో ఉంటాడు. శని మొత్తం 139 రోజులు మీన రాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఈ కార‌ణంగా కొన్ని రాశుల వారికి మంచి ఫ‌లితాలు అదే విధంగా మ‌రికొన్ని రాశుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావాలు ప‌డుతాయ‌ని పండితులు చెబుతున్నారు.

28
క‌న్యా రాశి

శ‌ని తిరోగ‌మ‌నం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారంగా అభివృద్ధి చెందుతారు. మతపరమైన ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు విజయవంతంగా సాగుతాయి. మొత్తం మీద క‌న్యా రాశి వారికి మంచి జ‌రుగుతుంది.

38
వృశ్చిక రాశి

విద్యా, ఉద్యోగ రంగాల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ల‌భించే అవ‌కాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పురోగతి ల‌భించే అవ‌కాశాలు మెరుగ్గా ఉంటాయి.

48
మకర రాశి

శని తిరోగ‌మ‌నం మ‌క‌ర రాశి వారికి క‌లిసొచ్చే అవ‌కాశాలు ఉంటాయి. ప‌నిచేసే ప్ర‌దేశంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సహోద్యోగుల మద్దతు ల‌భిస్తుంది. చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో వాటిని ధీటుగా ఎదుర్కొంటారు.

58
మీన రాశి

ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు లభించవచ్చు. పెట్టుబడులపై మంచి లాభాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల క‌నిపిస్తుంది. ప్రేమ, వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.

68
తులా రాశి

శ‌ని తిరోగ‌మ‌నం తులా రాశి వారిపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా కెరీర్‌లో సమస్యలు, సహోద్యోగులతో విభేదాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. వైవాహిక జీవితంలో గందరగోళ ప‌రిస్థితులు ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. చేసిన పనిలో ఎదురుదెబ్బలు త‌గిలే ప్ర‌మాదం ఉంది.

78
కుంభ‌రాశి

కుంభరాశి వారు ఆర్ధికంగా అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులు పెట్టకూడదు, ఒక‌వేళ పెట్టినా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. కెరీర్ విషయంలో జాగ్రత్త అవసరం. పనిలో గందరగోళం, తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబ‌ట్టి చేసే ప‌నిపై దృష్టినిసారించాలి.

88
నివార‌ణ చ‌ర్య‌లు

శని ప్రభావం తగ్గించేందుకు కొన్ని ర‌కాల నివార‌ణ చ‌ర్య‌లు పాటించాల‌ని పండితులు సూచిస్తున్నారు.  ప్రతి రోజు శివలింగంపై జలాభిషేకం చేయాలి. జలాభిషేక సమయంలో బిల్వపత్రం సమర్పించాలి. అలాగే ప్ర‌తీ రోజూ ఓం నమః శివాయ మంత్రాన్ని జ‌పించాలి.

Read more Photos on
click me!

Recommended Stories