వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. వీరు ఈ రోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకోని ఖర్చులను చేయాల్సి వస్తుంది. మీ అవసరాలకు డబ్బు సరిపోకపోవచ్చు. అప్పులు చేయాల్సి వస్తుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చులను నియంత్రిస్తే సమస్యలు రాకుండా ఉంటాయి. అవసరం లేని వ్యాయాలను తగ్గిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఉద్యోగం, వ్యాపారం
ఉద్యోగం, వ్యాపారంలో శ్రమ తప్పదు. ఉద్యోగులకు ఈ రోజు అదనపు పనిభారం ఉంటుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు రాదు. కానీ ప్రయత్ని గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. వ్యాపారులు ఒప్పందం, డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండలి. నిరుద్యోగులకు ఈ రోజు కూడా నిరాశే మిగులుతుంది. పట్టువదలకుండా ప్రయత్నిస్తే కొత్త అవకాశాలను అందుకుంటారు.