తులారాశివారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ రోజు ఆదాయ వ్యవహారాలు బాగుంటాయి. మీరు కోరుకున్న ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు చేసిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త పెట్టుబడుకు ఈ సమయం అనుకూలంగా ఉంది. ఖర్చులు రోజులాగే ఉంటాయి. కొత్త ప్రాజెక్టులతో మీరు అనుకున్న లాభాలను పొందగలుగుతారు.
ఉద్యోగం, వ్యాపారం
ఉద్యోగులకు ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను చూపిస్తాయి. ఉద్యుగులకు ఉన్న గొడవలకు ఈ రోజు పరిష్కారం దొరుకుతుంది. మీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతాయి. సహచరులతో మంచి సంబంధాలను ఏర్పరుచుకుంటారు. క్రయ విక్రయాల్లో మంచి లాభాలను పొందుతారు. వ్యాపారం విస్తరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం లాభాల్లో నడుస్తుంది.