కన్యారాశి వారికి ఈ రోజు ఆర్థికంగా బాగుండదు. వీరు ఎప్పుడో చేసిన అప్పులను తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులను చేయాల్సి వస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత పెంచుతుంది. అలాగే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆదాయం కూడా తగ్గుతుంది. అందుకే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఫైనాన్షియల్ ప్లాన్ ను ఏర్పాటు చేసుకుంటే పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
ఉద్యోగం, వ్యాపారం
వృత్తి పరంగా ఒత్తిడి కలుగుతుంది. పనిభారం ఎక్కువ అవుతుంది. దీంతో మీరు చేయాల్సిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అలాగే పనిభారం వల్ల శారీరకంగా బాగా అలసిపోతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఇతరులతో విభేదాలు వస్తాయి. సమస్యను పరిష్కరించుకుంటే అంతా సర్దుమనుగుతుంది.