Saturn Transit: రేవతి నక్షత్రంలోకి శని.. ఐదు నెలలపాటు ఈ రాశులవారికి కష్టాలు తప్పవు..!

Published : Feb 24, 2026, 12:30 PM IST

 Saturn Transit: శని గ్రహం మే 2026 నుండి దాదాపు 146 రోజుల పాటు రేవతి నక్షత్రంలోకి సంచరిస్తుంది. ఈ శని సంచారం మూడు రాశుల వారికి చాలా సమస్యలు మోసుకురానుంది. 

PREV
14
శని సంచారం...

జోతిష్యశాస్త్రం ప్రకారం, శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. అందుకే.. శని రాశి మారినా, నక్షత్రం మారినా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మే నెలలో ఈ శని గ్రహం... తన నక్షత్రాన్ని మార్చుకోనుంది. రేవతి నక్షత్రంలోకి అడుగుపెట్టనుంది. అక్టోబర్ 3వ తేదీ వరకు ఇదే నక్షత్రంలో ఉంటుంది. దీని ప్రభావం మూడు రాశులపై చాలా ఎక్కువగా పడనుంది. ముఖ్యంగా ఆ రాశుల వారికి విపరీతంగా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

24
1.మేష రాశి..

శని నక్షత్ర మార్పు కారణంగా మేష రాశివారు ఈ సమయంలో చాలా మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటారు. ఈ కాలంలో ఏ పని చేసినా ఆలస్యం అవుతుంది. అనేక అడ్డంకులు ఎదురౌతాయి. ఎంత కష్టపడినా ఫలితం తొందరగా రాదు. అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. డబ్బు ఆదా చేయడంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఈ సమయంలో సన్నిహితులతో ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. అపార్థాల కారణంగా ఫ్రెండ్స్ తో గొడవలు వచ్చే అవకాశం ఉంది.

చేసే పనిలోనూ చాలా అడ్డంకులు వస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. నిద్రలేని సమస్యలు, అలసట వంటివి కూడా రావచ్చు. ఈ సమయంలో ఈ రాశివారు చాలా ధైర్యంగా, ఓపికగా ఉండాలి. ఏ పనిని ప్రారంభించే ముందు సరిగ్గా ఆలోచించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే.. ఇబ్బంది పడతారు.

34
2.కుంభ రాశి...

కుంభ రాశి వారికి ఈ శని సంచారం చాలా సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. కెరీర్, కుటుంబ జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. ఈ సందర్భంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. ఎవరి సపోర్ట్ లభించదు. ఈ సమయంలో ఈ రాశివారు ఉద్యోగం మారడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ నష్టాలను తీసుకువస్తాయి. ఆఫీసులో సీనియర్లతో విభేదాలు ఎదుర్కోవలసి రావచ్చు. ఇంట్లో ఏదో ఒక అంశంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సంపద లేదా వాహనానికి సంబంధించిన విషయాల్లో అడ్డంకులు ఉండవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే శుభ ఫలితాలు పొందవచ్చు.

44
3.మీన రాశి...

శని నక్షత్ర మార్పు.. మీన రాశివారికి కూడా చాలా కష్టాలు తెచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే విపరీతంగా నష్టపోతారు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. నెగిటివ్ ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తాయి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఎవరినీ నమ్మకపోవడమే మంచిది. యోగా లాంటివి చేయడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories