మే నెలలో పుట్టిన వారికి శుక్రుడి అనుగ్రహం అధికంగా ఉంటుంది. దీని వల్ల వీరికి సంపద, విలాసవంతమైన జీవితం దక్కుతుంది. అలాగే ఈ నెలలో పుట్టిన వారికి ఆస్తులు కూడబెట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. మే నెలలో పుట్టిన వారు డబ్బు విలువ తెలుసుకొని ఖర్చు చేస్తారు. వీరు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫ్యాషన్, కళ, ఆహార పరిశ్రమ వంటి రంగాల్లో చక్కగా రాణిస్తారు. వీరు 30 ఏళ్లు దాటేసరికి సంపదను పెంచుకుంటారు.