
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహ సంచారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. శని దేవుడిని న్యాయ నిర్ణేతగా పరిగణిస్తారు. సాధారణంగా ఏలినాటి శని అనగానే ప్రజలు భయపడుతుంటారు. అయితే 2026 సంవత్సరంలో శని గ్రహ సంచారం వల్ల కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా రెండు రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, అరుదైన రాజయోగాల వల్ల శుభ ఫలితాలు కలగనున్నాయి.
2026లో సింహ రాశి, ధనుస్సు రాశి జాతకులు ఏలినాటి శనిలో ప్రభావంలో ఉంటారు. అంటే శని నీడ ఈ రాశులపై ఉంటుంది. అయితే, ఒక అద్భుతమైన శుభ సంయోగం కారణంగా ఈ రెండు రాశుల వారిపై శని దుష్ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం శని దేవుడు తన సొంత రాశి అయిన మకరంలో ఉండడమే. అక్కడ శనితో పాటు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు కూడా కలుస్తున్నారు. మకర రాశిలో ఈ నాలుగు గ్రహాల కలయిక వల్ల ఐదు మహా శుభ రాజయోగాలు ఏర్పడుతున్నాయి.
మకర రాశిలో శనితో పాటు ఇతర గ్రహాలు చేరడం వల్ల జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. అవి..
1. సూర్యుడు, బుధుడి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది.
2. శుక్రుడు, బుధుడి కలయిక వల్ల లక్ష్మీ నారాయణ రాజయోగం సిద్ధిస్తోంది.
3. సూర్యుడు, శుక్రుడి కలయిక వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది.
4. దీంతో పాటు ఇదే రాశిలో రుచక రాజయోగం కూడా ఏర్పడింది.
5. అలాగే కుజుడు, సూర్యుడి వల్ల మంగళాదిత్య రాజయోగం కూడా.
ఈ పంచ రాజయోగాల ప్రభావం వల్ల సింహ, ధనుస్సు రాశుల వారిపై ఏలినాటి శని తీవ్రత తగ్గి, సానుకూల ఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఏలినాటి శని ప్రభావం నుండి గొప్ప ఉపశమనం లభించనుంది. ఈ గ్రహాల కలయిక వల్ల సింహ రాశి వారికి ధన లాభం కలిగే బలమైన యోగాలు ఉన్నాయి. ప్రధానంగా..
ఈ ఐదు శుభ యోగాల వల్ల ధనుస్సు రాశి వారిపై కూడా ఏలినాటి శని ప్రభావం బలహీనపడుతుంది. వీరికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది..
రాజయోగాలు ఉన్నప్పటికీ, ఎవరికైనా ఏలినాటి శని (శని సాడే సతి) వల్ల ఇబ్బందులు ఎదురైతే, కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు..
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, పలువురు పండితులు తెలిపిన విషయాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.