Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపారం చేస్తే..తిరుగులేని సంపద మీ సొంతం

Published : Jan 21, 2026, 05:44 PM IST

Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి పుట్టుకతోనే వ్యాపార సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటాయి. వీరు ఉద్యోగం కంటే వ్యాపారం ఎంచుకుంటే కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువ.ఆ తేదీలేంటో చూద్దాం.. 

PREV
14
నెంబర్ 1.. నాయకత్వమే వీరి బలం..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు. వీరికి సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యాపారం ఎంచుకుంటే బాగా రాణించగలరు. ఎందుకంటే.. వీరిలో అద్భుతమైన నిర్ణయాధికారం, ఆత్మవిశ్వాసం ఉంటాయి. స్టార్టప్స్, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ లేదా ప్రభుత్వ కాంటాక్టులు వీరికి బాగా కలిసి వస్తాయి.

24
నెంబర్ 5 .. వ్యాపార మేథావులు...

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి బుధుడు గ్రహాధిపతి అవుతాడు. వ్యాపారాల్లో రాణించగల చతురత వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. మాటలతో ఎవరినైనా ఇట్టే బుట్టలో వేసుకోగల సత్తా వీరిలో ఉంటుంది. వీరు చాలా వేగంగా లెక్కలు వేయగలరు. రిస్క్ ని కూడా త్వరగా అంచనా వేస్తారు. అందుకే, వీరు వ్యాపారం ఎంచుకుంటే బాగా రాణించగలరు. వీరు ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, ఐటీ రంగం, కమ్యూనికేషన్ రంగాల్లో వీరు అగ్రస్థానంలో ఉంటారు.

34
నెంబర్ 6.. లగ్జరీ, అదృష్టం...

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు డబ్బును చాలా సులభంగా ఆకర్షించే శక్తి కలిగి ఉంటారు. వీరి ఆలోచనలు చాలా క్రియేటివ్ గా ఉంటాయి. ప్రజలను ఆకర్షించే వస్తువులను అమ్మడంలో వీరు దిట్ట అని చెప్పొచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఫ్యాషన్, జ్యూవెలరీ, మీడియా, హోటల్, కాస్మెటిక్ రంగాల్లో వీరు బాగా రాణించగలరు.

44
నెంబర్ 8... స్థిరమైన సామ్రాజ్యాలు...

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. వీరు కూడా వ్యాపారాల్లో బాగా రాణించగలరు. మొదట వీరు వ్యాపారం ప్రారంభించినప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డా.. పట్టుదలతో అపారమైన ఆస్తులను కూడపెడతారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని గ్రహ ప్రభావం ఉంటుంది. దీని వల్ల వీరు చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఒక్కసారి వీరు వ్యాపారం మొదలుపెడితే.. తరతరాలకు నిలిచిపోయేలా చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories