Zodiac sign: 2 నెల‌లు ఓపిక ప‌డితే చాలు.. ఈ రాశుల వారికి అప్పుల నుంచి రిలీఫ్

Published : Jan 21, 2026, 05:46 PM IST

Zodiac sign: మ‌న జ్యోతిషం మ‌న ఆర్థిక ప‌రిస్థితుల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని పండితులు చెబుతుంటారు. ప్ర‌స్తుత గ్ర‌హ గోచారం ప్ర‌కారం కొన్ని రాశుల వారికి అప్పుల బాధ తీర‌నుంద‌ని చెబుతున్నారు. 

PREV
17
మార్చి నుంచి ఆర్థిక ఒత్తిడులకు గుడ్‌బై

ప్రస్తుత గ్రహ గోచారం ప్రకారం కొన్ని రాశుల వారికి డబ్బు సంబంధిత ఇబ్బందులు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ధన స్థానాన్ని ప్రభావితం చేసే గ్రహాలు అనుకూలంగా ఉండటంతో ఆదాయ ప్రవాహం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులకు ఈ కాలం లాభదాయకంగా మారనుంది. మార్చి నుంచి జూన్ మధ్యలో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం, పెండింగ్‌లో ఉన్న డబ్బు చేతికి రావడం జరుగుతుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఒత్తిడులు చాలా వరకు తొలగిపోతాయి.

27
మేష రాశి వారికి మెరుగైన ఆర్థిక ప‌రిస్థితి

మేష రాశి వారికి ధన స్థానాన్ని ప్రభావితం చేసే శుక్రుడు అనుకూలంగా మారడంతో ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది. గురువు సహకారం పెరుగుతున్న కారణంగా తక్కువ ప్రయత్నంతోనే మంచి లాభాలు అందుకునే అవకాశం ఉంటుంది. షేర్లు, పెట్టుబడులు, వాణిజ్య లావాదేవీలు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు ఆలస్యం లేకుండా అందుతుంది.

37
వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది

బుధుడి అనుకూల సంచారం పెద్ద ప్లస్‌గా మారుతుంది. వృత్తి రంగంలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాలు మెరుగవుతాయి. వ్యాపార రంగంలో లాభాలు అంచనాలకు మించి ఉండే అవకాశం కనిపిస్తోంది. ధనయోగాలు ఒకటి కంటే ఎక్కువసార్లు అనుభవించే సూచనలు ఉన్నాయి.

47
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి రవి అనుకూలంగా ఉండటంతో డబ్బు సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతుంది. పెట్టిన ప్రతి ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుంది. బాకీలు వసూలవుతాయి. పెట్టుబడుల నుంచి లాభాలు అందుతాయి. ఈ కాలంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.

57
తుల రాశి

ఈ రాశి వారికి శుక్రుడి బలమైన ప్రభావం కొనసాగుతుంది. ఆర్థిక సమస్యలు పెద్దగా తలెత్తే పరిస్థితి కనిపించదు. గురువు సహకారం వల్ల అదృష్టం కూడా కలిసివస్తుంది. వృత్తి రంగంతో పాటు ప్రభుత్వ సంబంధిత ప్రయోజనాల ద్వారా కూడా డబ్బు లభించే అవకాశం ఉంటుంది. అవసరమైనవారికి సహాయం చేసే స్థాయికి చేరుతారు.

67
మకర రాశి వారికి రుణ బంధనాల నుంచి ఉపశమనం

మకర రాశి వారికి శని సంచారం ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఇస్తోంది. అప్పులు, రుణాలు ఏప్రిల్ లోపు క్రమంగా తగ్గుతాయి. ఆదాయం పెంచే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తున్నవారికి జీతం పెరుగుతుంది. వ్యాపార లాభాలు స్థిరంగా వస్తాయి. షేర్లు, పెట్టుబడుల నుంచి అంచనాలకు మించిన లాభాలు సాధించే అవకాశం ఉంది. ఆస్తి సంబంధిత వివాదాలు కూడా అనుకూలంగా ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి.

77
మీన రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు

మీన రాశి వారికి వచ్చే మూడు నెలలు ఆర్థికంగా చాలా కీలకంగా మారతాయి. ధన స్థానాన్ని ప్రభావితం చేసే గ్రహాలు అనుకూలంగా ఉండటంతో అకస్మాత్తుగా డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి రంగంలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపార లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండవచ్చు. ఆస్తి లావాదేవీల ద్వారా సంపద వృద్ధి చెందే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలంగా వెంటాడుతున్న ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం, ప‌లువురు పండితులు తెలిపిన విష‌యాల ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Read more Photos on
click me!

Recommended Stories