Today Rasi Phalalu: నేడు ఈ 3 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. అనుకూల ఫలితాలు!

Published : May 29, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 29.05.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

413
మిథున రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. బంధువుల నుంచి రుణ ఒత్తిడులు తప్పవు. ఆర్థిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనులలో ఎంత కష్ట పడ్డా ఫలితం ఉండదు. ఉద్యోగ, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. దైవ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుంచి ఆటుపోట్లు తప్పవు.

713
కన్య రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

813
తుల రాశి ఫలాలు

కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. ఇంటా బయటా నిరాశ తప్పదు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ప్రయాణాలు శ్రమతో కూడుకొని ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన రుణ యత్నాలు చేస్తారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

1113
మకర రాశి ఫలాలు

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు

కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మిత్రుల నుంచి విమర్శలు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఇతరులతో నిదానంగా ప్రవర్తించడం మంచిది.

1313
మీన రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories