Lord Rama: రాముడు తన చేతులతో ప్రతిష్టించిన శివలింగం ఎక్కడ ఉంది? జీవితంలో ఒక్కసారి అయినా చూడాల్సిందే

Published : Sep 15, 2025, 11:06 AM IST

రాముడు జీవితం హిందూ భక్తులకు పరమవేదం. రాముడు ఆ శివుడిని పూజించాడని అంటారు. అంతేకాదు తన చేతులతోనే ఆయన శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. ఆ శివలింగమే ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామేశ్వరంగా మారింది.

PREV
15
రాముడు ప్రతిష్టించిన శివలింగం

భారతీయ ప్రజలకు రాముడు ఆరాధ్య దేవుడు. అతడి జీవితం, అతని గుణగణాలు, లక్షణాలు, వ్యక్తిత్వం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. రాముడు తన చేతులతోనే ఒకచోట శివలింగాన్ని ప్రతిష్టించాడని చెప్పుకుంటారు. అది ఎక్కడుందో మీకు తెలుసా? రామేశ్వరంలో తమిళనాడులోని ఒక పవిత్ర ద్వీపం అది. అక్కడే రాముడు శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఇప్పుడు రామేశ్వరంగా ఆ ప్రాంతం ప్రసిద్ధ జ్యోతిర్లింగంగా మారింది.

25
రాముడు లంకను చేరేందుకు

రామాయణ మహాకావ్యంలో లంకా యుద్ధానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రాముడు లంకను చేరాలంటే సముద్రాన్ని దాటాలి. అందుకు వంతెన కట్టింది రామేశ్వరం దగ్గరే. దాన్ని రామసేతు అని పిలుస్తారు. భారతదేశంలోని రామేశ్వరం ద్వీపం.. శ్రీలంకలోని మన్నార్ ద్వీపం మధ్య ఈ రామసేతు కనిపిస్తుంది.

35
వానర సైన్యంతో

సీతను కాపాడేందుకు వానర సైన్యంతో సముద్రాన్ని దాటి రాముడు లంకకు చేరుకోవాలి. అందుకే రాముడు ఆ శివుడు ఆశీస్సులను కోరుకున్నాడు. ఇందుకోసం శివుడిని ప్రార్థించి శివలింగాన్ని అక్కడ ప్రతిష్టించాడు. అదే జ్యోతిర్లింగంగా మారింది. రాముడు ఈశ్వరుడు కలిపి రామేశ్వరంగా మారింది. రామేశ్వరాన్ని జీవితంలో ఒక్కసారి అయినా కనులారా చూడాలని ఎంతోమంది భక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటారు.

45
రామసేతు

రాముడి వంతెన లేదా రామసేతును ఆడమ్స్ బ్రిడ్స్ అని కూడా పిలుస్తారు. దీనిని చూసేందుకే ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వస్తారు. రామేశ్వరం అనేది చెన్నై నుంచి 572 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి సముద్రమార్గం ద్వారా శ్రీలంకను చేరుకోవచ్చు.

55
రామనాథ స్వామి ఆలయం

రామేశ్వరం లో ఉన్న రామనాథ స్వామి ఆలయం కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలలో ఒకటి. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో శివుడికి అంకితం చేసిన అద్భుతమైన జ్యోతిర్లింగం ఇక్కడ ఉంది. శ్రీరాముడి భక్తులు, ఈశ్వరుడి భక్తులు కూడా ఇక్కడికి తండోపతండాలుగా వస్తారు. వీలైతే జీవితంలో ఒక్కసారి అయినా ఈ రామేశ్వరాన్ని చూసి తరించండి.

Read more Photos on
click me!

Recommended Stories