Shani Transit: 27 ఏళ్ల తర్వాత పూర్వాభాద్ర నక్షత్రంలోకి శని గ్రహం, ఈ రాశుల వారిదే అదృష్టమంతా

Published : Sep 15, 2025, 10:19 AM IST

శనిదేవుడు (Shani) పూర్వాభాద్రపద నక్షత్రంలోకి త్వరలో ప్రవేశించబోతున్నాడు. ఈ శని సంచారం కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చేలా చేస్తుంది. వారు పట్టిందల్లా బంగారమే. ఆ రాశులేవో తెలుసుకోండి. 

PREV
14
శని దేవుడి సంచారం

శని దేవుడి సంచారం 12 రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశులపై సానుకూలంగా ప్రభావం పడితే, కొన్ని రాశులపై ప్రతికూలంగా పడుతుంది.  ప్రస్తుతం శని గ్రహం ఉత్తరాభాద్రపద నక్షత్రంలో ఉన్నాడు. అక్టోబర్ 3న పూర్వాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి గురువు.  శని గ్రహం చాలా నెమ్మదిగా సంచరించే గ్రహం. 27 ఏళ్ల తరువాత పూర్వా భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి అక్టోబర్ 3 నుంచి విపరీతంగా కలిసివస్తుంది. ఆ రాశులు ఇవే.

24
మిథున రాశి

శనిదేవుని నక్షత్ర మార్పు మిధున రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. శనిదేవుడు మీ రాశి చక్రంలో ఉద్యోగ, వ్యాపార స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి, ఈ సమయంలో మీరు మీ ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధించవచ్చు. ఈ సమయంలో, కొత్త భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు. వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

34
కుంభ రాశి

శనిదేవుని నక్షత్ర మార్పు మీకు ఎంతో ప్రయోజనకరమైనది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనితో పాటు గౌరవం, ప్రతిష్టను పొందుతారు. ఉద్యోగస్తులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన  అవసరం రాదు.  వీరికి అన్ని వైపుల నుండి డబ్బు చేతికి అందుతుంది.  మీరు ఊహించని ధనలాభం పొందవచ్చు. ఈ సమయంలో మీ మాట ప్రభావం పెరుగుతుంది. దీని వలన ప్రజలు ప్రభావితులవుతారు.

44
మకర రాశి

మకర రాశి వారికి శనిదేవుని నక్షత్ర మార్పు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే శనిదేవుడు మీ రాశి నుండి మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో, మీ ధైర్యం, పరాక్రమం పెరుగుతుంది. విద్యార్థులకు చదువుల్లో విజయం దక్కుతుంది.  ఈ సమయంలో మీరు చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధంలో మెరుగుదల కనిపిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories