Rahu Transit: కుంభరాశిలోకి రాహువు, ఈ మూడు రాశుల పని అయిపోయినట్లే

Published : May 19, 2025, 01:19 PM IST

మే 18న రాహువు మీన రాశి నుండి కుంభ రాశికి గోచరిస్తున్నాడు. ఈ రాశి మార్పు వల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక జీవితంలో ఒడిదుడుకులు రావచ్చు.

PREV
14
రాశిని మార్చిన రాహువు

జోతిష్యశాస్త్రంలో రాహువును చాలా క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. ఈ రాహు గ్రహం రాశిని మార్చుకున్నప్పుడల్లా అన్ని రాశులపై చాలా ఎక్కువగానే ప్రభావం చూపిస్తాడు. తాజాగా మే 18వ తేదీన మీన రాశి నుంచి కుంభ రాశిలోకి అడుగుపెట్టింది.  ఈ మార్పు మూడు రాశులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా వారికి ఆర్థిక కష్టాలు, ఉద్యోగాల్లో సమస్యలు రానున్నాయి. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా…

24
వృషభ రాశి..
వృషభ రాశి వారికి రాహువు పదవ స్థానంలో గోచరిస్తున్నాడు. ఇది ఉద్యోగ స్థానాన్ని సూచిస్తుంది. ఈ స్థానంలో రాహువు ఉండటం వల్ల ఉద్యోగంలో సమస్యలు ఎదురవ్వచ్చు. సహోద్యోగులతో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఉద్యోగ మార్పు ఆలోచనలు వచ్చినా అవకాశాలు దొరకడం కష్టం. శివుడికి అభిషేకం చేయడం మంచిది.
34
మకర రాశి..
మకర రాశి వారికి రాహువు రెండవ స్థానంలో గోచరిస్తున్నాడు. ఇది ధన, కుటుంబ స్థానాన్ని సూచిస్తుంది. ఈ స్థానంలో రాహువు ఉండటం వల్ల ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. వినోదాలకు ఖర్చు చేయడం మంచిది కాదు. అనవసరంగా ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. నిరుపేదలకు దానధర్మాలు చేయడం మంచిది.
44
మీన రాశి..
మీన రాశి వారికి రాహువు పన్నెండవ స్థానంలో గోచరిస్తున్నాడు. ఇది నష్ట స్థానాన్ని సూచిస్తుంది. ఈ స్థానంలో రాహువు ఉండటం వల్ల ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. విదేశాల్లో పనిచేసేవారికి ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు. ఆరోగ్య సమస్యలు ఖర్చులకు దారితీయవచ్చు. చెడు సహవాసాలు చేయకపోవడం మంచిది. శివ చాలీసా పారాయణం చేయడం మంచిది.
Read more Photos on
click me!

Recommended Stories