Rahu Transit: పదేళ్ల తర్వాత సొంత నక్షత్రంలోకి రాహువు.. ఈ మూడు రాశుల కష్టాలు తీరినట్లే..!

Published : Sep 26, 2025, 08:14 AM IST

 Rahu Transit: 10 ఏళ్ల తర్వాత రాహువు తన సొంత నక్షత్రమైన శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా, మూడు రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్లనున్నారు. 

PREV
14
zodiac signs

జోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువును నీడ గ్రహం అని పిలుస్తారు. రాహువు ఎల్లప్పుడూ వెనకకు కదులుతూ, ఒకటిన్నర సంవత్సరాల తర్వాత తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. మధ్యలో రాహువు నక్షత్ర మార్పు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ నక్షత్ర మార్పును చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం నవంబర్ లో రాహు పూరత్తాది నక్షత్రం నుండి బయటకు వెళ్లి... తన సొంత నక్షత్రమైన శతభిష నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. తన సొంత నక్షత్రంలోకి రాహు అడుగుపెట్టడం దాదాపు పదేళ్ల తర్వాత జరుగుతోంది. దీని వల్ల... మూడు రాశులకు మేలు జరగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా...

24
1.మిథున రాశి....

రాహువు నక్షత్ర మార్పు... మిథున రాశివారికి చాలా మేలు చేయనుంది. అన్ని రంగాల్లో వీరికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. జీవితంలో అన్ని విషయాల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. కెరీర్ లో ప్రమోషన్స్ పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. పనిలో, వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కొత్త బాధ్యతలు చేపడతారు. తండ్రితో సంబంధం బలపడుతుంది. పూర్వీకుల ఆస్తి కూడా లభించే అవకాశం ఉంది.

34
కర్కాటక రాశి...

రాహు నక్షత్ర మార్పు.. కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు అన్ని రంగాలలో గొప్ప ప్రయోజనాలను పొందుతారు. ఈ కాలంలో, వారి ప్రజాదరణ విపరీతంగా పెరుగుతుంది మీ వ్యక్తిత్వం కారణంగా ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీరు ఎక్కడికి వెళ్లినా మీకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ధైర్యం , ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతాయి. మీ కెరీర్ , సామాజిక జీవితంలో విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. జీవిత నాణ్యత మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆరోగ్యం, మనశ్శాంతి , ఆనందం ఉంటాయి. మొత్తంమీద, ఈ కాలంలో మీరు చాలా సంతృప్తి చెందుతారు.

44
కుంభ రాశి...

కుంభ రాశి అధిపతి శని. అయితే.. రాహువుతో స్నేహపూర్వక భావన ఉంటుంది. రాహువు తన సొంత నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల కుంభ రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. కుంభ రాశి వారు నవంబర్ తర్వాత వారి జీవితాల్లో పెద్ద మార్పులను చూస్తారు. వారు మంచి ఆర్థిక ఫలితాలను ఆస్వాదించవచ్చు. కొత్త వనరుల నుండి డబ్బు లభిస్తుంది. పాత రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆనందం వస్తుంది. వివాహ జీవితం మధురంగా ​​ఉంటుంది. పనిలో కొత్త బాధ్యతలు అందుబాటులో ఉండవచ్చు. మీరు కష్టపడి పని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందుతారు. ప్రణాళికాబద్ధమైన పనులన్నీ విజయవంతమవుతాయి. మీరు సమాజంలో మీకంటూ ఒక ముద్ర వేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories