నేడు ఓ రాశివారికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది!

Published : Sep 26, 2025, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 26.09.2025 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

313
వృషభ రాశి ఫలాలు

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు.

413
మిథున రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

613
సింహ రాశి ఫలాలు

ఇంటా బయటా కొత్త విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

713
కన్య రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు చర్చిస్తారు. నూతన వాహన యోగం ఉంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

813
తుల రాశి ఫలాలు

ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్లు తప్పవు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

1113
మకర రాశి ఫలాలు

కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

1213
కుంభ రాశి ఫలాలు

ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.

1313
మీన రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నిరాశ తప్పదు. నిరుద్యోగులకు రావాల్సిన అవకాశాలు తృటిలో తప్పిపోతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories