ఈ తేదీల్లో పుట్టినవాళ్లు ఇతరులను బాధపెట్టి ఆనందం పొందుతారు!

Published : Sep 25, 2025, 02:44 PM IST

సంఖ్యా శాస్త్రం ప్రకారం వ్యక్తుల స్వభావాన్ని అంచనా వేయడంలో మూలసంఖ్య ప్రధానమైనది. ఆ సంఖ్య ద్వారా వ్యక్తి భావోద్వేగాలు, ఆలోచనలు, ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టినవారు ఇతరులను బాధపెట్టి సంతోషిస్తారు. ఆ తేదీలేంటో చూద్దాం.

PREV
15
Birth Date

సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారికి సహజంగానే గర్వం, అహంకారం, తక్కువ ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఉంటాయట. ఈ లక్షణాల వల్ల కొందరు ఇతరుల బాధలను అర్థం చేసుకోలేరు. లేదా మరింత బాధ పెట్టాలని చూస్తారు. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.

25
1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు :

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అదే సమయంలో గర్వం, స్వార్థం, ఇతరుల భావాలను పట్టించుకోకపోవడం వంటి లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంది. తమకు అనుకూలంగా లేని వారిపై ఎదురుదాడికి దిగడానికి కూడా వీరు వెనుకాడరు. కొన్నిసార్లు తమ ప్రయోజనం కోసం ఇతరులకు నష్టం కలిగినా పట్టించుకోరు. ఇదంతా వాళ్లు కావాలని ఇతరులను కష్టపెట్టాలని చేయరు. కానీ వారి స్వభావం వల్ల తెలియకుండానే ఇతరుల బాధకు కారణమవుతారు.

35
7, 16, 25 తేదీల్లో పుట్టినవారు :

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టినవారు సాధారణంగా అంతర్ముఖ స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎమోషనల్ గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. తమ సమస్యలను ఇతరులతో పంచుకోరు. వారి సమస్యల్ని వారే పరిష్కరించుకోవడానికి ఇష్టపడతారు. కానీ వారిలో కొందరు ఇతరులను నేరుగా బాధ పెట్టకపోయినా.. తమ మాటల ద్వారా లేదా చేష్టల ద్వారా మానసికంగా గాయపరుస్తారు. వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. తాము నింద పడకుండా, ఎదుటివారిని దోషిగా నిలబెట్టడంలో వీరు ముందుంటారు.

45
8, 17, 26 తేదీల్లో పుట్టినవారు :

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టినవారు శని ప్రభావం కలిగి ఉంటారు. వీరికి క్రమశిక్షణ, కఠినత్వం, ధైర్యం ఎక్కువే ఉంటాయి. కానీ అదే సమయంలో చాలా నిర్దయగా ప్రవర్తిస్తారు. శని ప్రభావం వల్ల గంభీర స్వభావం కలిగి ఉంటారు. కొన్నిసార్లు వీరు తమ సమస్యలను ఇతరుల మీద వదలేయడమో లేదా బాధను షేర్ చేయకపోవడం వల్ల టెన్షన్‌ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. పక్కవారికి నష్టమైతే కూడా.. అది తమ వల్ల కాదనే భావనలో ఉంటారు. 

55
13, 22, 31 తేదీల్లో పుట్టినవారు :

13, 22, 31 తేదీల్లో పుట్టినవారు మిశ్రమ స్వభావం కలిగి ఉంటారు. వీరికి ప్రేమ, కోపం, ప్రతీకారం, వ్యంగ్యం అన్నీ ఎక్కువే. ఏది మంచి, ఏది చెడు అన్నది నిర్ణయించుకోవడంలో వీరికి స్పష్టత తక్కువ. దానివల్ల ఇతరులు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. వారికి నష్టం జరిగినప్పుడు నిద్రాహారాలు మానేస్తారు. కానీ అదే ఇతరులకు జరిగినప్పుడు లోలోపల సంతోషిస్తారు. 

Read more Photos on
click me!

Recommended Stories