మేష రాశి వారికి అనుకూల స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. రాహువుపై గురు, కుజ గ్రహాల దృష్టి ఉండటం వల్ల ఈ రాశివారికి ఆదాయంలో వృద్ధి, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. విదేశీ ప్రయాణం, సంతాన ప్రాప్తి, ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త శిఖరాలకు చేరుకుంటాయి. లాభాలు పెరుగుతాయి. షేర్లు లాభదాయకంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.