Rice bag: జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు భాగమే. ఇంటి శ్రేయస్సు, ఇంటి కుటుంబ సభ్యుల ఆనందాన్ని కాపాడడానికి వాస్తు చిట్కాలు ఎంతగానో పనిచేస్తాయి. వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఆర్థిక సమస్యలు తగ్గాలంటే వంటగదిలో ఉన్న బియ్యం డబ్బాలో ఒక వస్తువును ఉంచాలి.
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు సంపదను సానుకూల శక్తిని పెంచుతాయి. మరికొన్ని వస్తువులు నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. కాబట్టి ఇంట్లో పెట్టే వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువులు కేవలం ఇంట్లో అలంకరణ కోసం కాదు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచేందుకు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పెట్టాల్సి ఉంటుంది. చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్, నవ్వుతున్న బుద్ధుడు వంటివి ఉంచుతారు. దీని వల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది. అలాగే బియ్యం డబ్బాలో ఒక వస్తువును ఉంచడం వల్ల కూడా ఇంటి పరిస్థితి మారిపోయే అవకాశం ఉంది. ఆ వస్తువు ఏంటో తెలుసుకోండి.
24
బియ్యంలో రెండు వెండి నాణాలు లేదా...
హిందూ మత ఆచారాల ప్రకారం బియ్యం ఎంతో పవిత్రమైనవి. ఇంట్లో బియ్యం నిండుగా ఉండాలని చెబుతారు. బియ్యం శ్రేయస్సు, సంపదను అందిస్తుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం రెండు వెండి నాణాలు బియ్యం డబ్బాలో వేయాలి. లేదా ఎర్రటి వస్త్రంలో పసుపు ముద్దను కట్టి దాచాలి. ఇలా చేయడం ఎంతో శుభప్రదమని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవిని ఆవాహన చేసుకున్నట్టు అవుతుంది. ఇంట్లో శ్రేయస్సు కూడా పెరుగుతుంది.
34
లోహపు తాబేలు
లోహపు తాబేలు కూడా ఇంటికి స్థిరత్వాన్ని, సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు. దానిని నీటితో నింపిన ఒక చిన్న పాత్రలో ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి. ఇది ఇంటి పెద్దకు దీర్గాయువును పెంచడమే కాదు.. ఆర్థిక స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది. క్రమంగా సంపద కూడా పెరుగుతుంది. అలాగే నవ్వుతున్న బుద్ధుడు, మూడు కాళ్ల కప్ప కూడా సంపదని ఆకర్షిస్తాయని చెబుతారు. ఇంటి ప్రధాన ద్వారం వైపు అవి చూసేలా పెట్టాలి. వాటిని వంట గదిలో, నేలపైన ఉంచకూడదు. నవ్వుతున్న బుద్ధుడు డ్రాయింగ్ రూమ్ లో ఉంచడం వల్ల అంతా అనుకూలంగా ఉంటుంది.
మనీ ప్లాంట్ ఇంటి అందాన్ని పెంచుతుంది. అలాగే ఇది సంపదను కూడా ఆకర్షిస్తుంది. తన చుట్టుపక్కల ఉన్న గాలిని శుద్ధి చేసి మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఇక దీని పచ్చని ఆకులు శ్రేయస్సును సూచిస్తాయి. వాస్తు ప్రకారం దీన్ని ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచితే శుభప్రదం అని చెబుతారు. అయితే ఎప్పుడూ కూడా దీనిని ఈశాన్య దిశలో ఉంచకూడదని అంటారు. వాస్తు శాస్త్ర ప్రకారం నీరు కిందకి పడుతున్నట్టు ఉండే ఫౌంటైన్ ను కూడా సంపద ప్రవాహానికి చిహ్నంగా చెప్పుకుంటారు. చాలామంది తమ ఇళ్లల్లో ఈ చిన్న ఫౌంటెన్ ఏర్పాటు చేసుకుంటారు. దీన్ని ఇంటికి ఉత్తర దిశలో ఉంచుకుంటే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇది సంపదను, శ్రేయస్సును ఇంట్లో నిలుపుతుందని నమ్ముతారు.