Planetary transits: మే 22 నుంచి గ్రహ సంచారం వల్ల ఈ రాశులవారు మట్టి ముట్టినా బంగారమే

Published : May 11, 2026, 08:19 AM IST

Planetary transits: హిందూ క్యాలెండర్ ప్రకారం మూడో నెల  జ్యేష్ఠ మాసం. ఈ తెలుగు నెల మే 22న మొదలై జూన్ 21 వరకు ఉంటుంది. ఈ సమయంలో గ్రహాల సంచారం వల్ల కొన్ని శుభ యోగాలు ఏర్పడతాయి. దీనివల్ల 5 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది.

PREV
15
మేష రాశి

మేష రాశి వారికి జ్యేష్ఠ మాసం ఒక వసంత కాలం లాంటిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో వారి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు వీరికి దక్కే అవకాశం ఉంది.  ఇక వ్యాపారంలో ఉన్న వారికి లాభాలు కలుగుతాయి. ఇతరుల చేతిలో చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది.  లేదా నష్టపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఆర్ధికంగా బలంగా మారుతారు.

25
వృషభ రాశి

వృషభ రాశి వారి ఇంట జ్యేష్ట మాసంలో ఆనందం వెల్లివిరుస్తుంది.ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.  ఇక ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమై లాభం చేకూరుతుంది.

35
సింహ రాశి

సింహ రాశి వారికి ఈ నెల స్వర్ణయుగం అని చెప్పాలి. జ్యేష్ఠ మాసంలో ఈ రాశి వారికి పలుకుబడి, గౌరవం పెరుగుతాయి. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. ఈ రాశి వారికి వ్యతిరేకంగా పనిచేసిన శత్రువులు ఓడిపోతారు. ఈ రాశి వారు తమ లక్ష్యాలను చాలా సులభంగా చేరుకుంటారు.

45
తులా రాశి

తులా రాశి వారు అటు ఉద్యోగంలో, ఇటు కుటుంబ జీవితంలో  కూడా సంతోషంగా జీవిస్తారు. జీవితంలో  సమతుల్యత ఉంటుంది. పని చేసే చోట పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు లభించవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి వివాహ యోగం కలిసొచ్చే సమయం ఇది.

55
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి జ్యేష్ఠ నెలలో డబ్బు ప్రవాహం బావుంటుంది. మీరు పొదుపు చేస్తారు. దీని వల్ల  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ముఖ్యంగా విద్యార్థులు చదువులో అద్భుతమైన పురోగతిని చూస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories