ఈ రాశులకు నలుపు రంగు అదృష్టాన్ని తెస్తుంది...
కుంభ రాశి (Aquarius): నలుపు రంగు ఈ రాశివారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
తుల రాశి (Libra): నలుపు వీరికి చాలా శుభప్రదం. ఇది మీ ఆకర్షణ శక్తిని రెట్టింపు చేస్తుంది.
వృషభ రాశి (Taurus): వీరికి నలుపు రంగు ధరించడం వల్ల అదృష్టం కలిసి రావడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వృశ్చిక రాశి (Scorpio): వీరికి నలుపు చాలా శుభప్రదం. ఇది మీకు మానసిక బలాన్ని, శక్తిని ఇస్తుంది.
కన్య రాశి (Virgo): నలుపు రంగు వీరికి హుందాతనాన్ని, గాంభీర్యాన్ని ఇస్తుంది.
మకర రాశి (Capricorn): మకర రాశి వారికి నలుపు చాలా అనుకూలమైన రంగు. ఇది మీకు విజయాన్ని చేకూరుస్తుంది.
ముఖ్య గమనిక: ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు లేదా పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు పైన చెప్పిన సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు.