జ్యోతిష్యం ప్రకారం రాశులు, నక్షత్రాలు వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారు పుట్టుకతోనే అదృష్టవంతులట. జీవితాంతం వారికి డబ్బుకు లోటే ఉండదట. మరి ఏ నక్షత్రాల్లో పుట్టినవారు ఇంతటి అదృష్టాన్ని కలిగి ఉంటారో ఇక్కడ చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన నక్షత్రం.. కొందరికి సానుకూల ఫలితాలను, మరికొందరికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారు జీవితాంతం సిరి సంపదలతో తులతూగుతారట. వారి జీవితం తిరుగులేకుండా సాగుతుందట. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు.. పుట్టుకతోనే అదృష్టవంతులట. మరి ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఇలా ఉంటారో తెలుసుకుందామా…
ఒక వ్యక్తి పుట్టిన టైంని బట్టి వారి జన్మ నక్షత్రాన్ని నిర్ణయిస్తారు. ఆ జన్మ నక్షత్రం ఆధారంగా వారి జీవితం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి అదృష్టం నీడలా ఉంటుందట. జీవితాంతం వీరు సంపన్నులుగా జీవిస్తారట. మరి ఆ అదృష్ట నక్షత్రాలు ఏంటో ఓసారి చూద్దాం.
25
ఏ నక్షత్రాల్లో పుట్టిన వారు అదృష్టవంతులు?
భరణి నక్షత్రం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. భరణి నక్షత్రంలో జన్మించిన వారు జీవితాంతం ధనవంతులుగా ఉంటారు. వీరు ఇళ్లు, భూములను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.
కృత్తికా నక్షత్రం
కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు మంచి జ్ఞానవంతులు, విద్యావంతులు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. నీతి, నిజాయతీ వీరి సొంతం. ఈ గుణాలు వీరి సంపదను మంరింత పెంచుతాయి. జీవితాంతం వీరు ధనవంతులుగానే ఉంటారు.
35
అశ్విని నక్షత్రం
అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు పుట్టుకతోనే ధనవంతులు. తెలివితేటలు, ధైర్య సాహసాలు వీరి సొంతం. వీరెప్పుడు సొంత ఆలోచనలకే ప్రాధాన్యం ఇస్తారు. అద్భుతమైన తెలివితేటలతో జీవితాన్ని గొప్పగా మలుచుకుంటారు.
మఖా నక్షత్రం
మఖా నక్షత్రంలో పుట్టిన వారు అదృష్టాన్ని కలిగి ఉంటారు. కష్టం, అదృష్టం తోడై జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. ఈ నక్షత్రంలో జన్మించినవారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కడ పనిచేసినా.. తక్కువ టైంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు.
ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో పుట్టిన వారు ఏ రంగంలోనైనా రాణించగలరు. వీరికి ఏ పనిలోనైనా ఈజీగా విజయం దక్కుతుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారు చిన్ననాటి నుంచే సంపన్నులుగా జీవిస్తారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులైన సానుకూలంగా మార్చుకోవడంలో వీరికి ఎవరు సాటిరారు.
55
పూర్వ ఫాల్గుణి నక్షత్రం
పూర్వ ఫాల్గుణి నక్షత్రంలో జన్మించిన వారు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు. వీరు స్వతంత్రంగా, విలాసవంతంగా జీవించాలని కోరుకుంటారు. వీరు ఏ పనిచేసినా కలిసివస్తుంది. ఈ నక్షత్రంలో పుట్టినవారు వారి మాటతీరుతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. తోటివారితో సన్నిహితంగా మెలగడంలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు.