ప్రతినెలా 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారు వారి మూల సంఖ్య 3 అవుతుంది. అంటే వీరు పుట్టిన తేదీలోని అంకెలను కలిపితే మూడు అంకె వస్తుంది. వీరు తెలివైన వారు, కొత్తగా ఆలోచించేవారుగా చెప్పుకోవచ్చు. చదువు, ఉద్యోగం విషయంలో మాత్రం ప్రారంభ దశలో అడ్డంకులు ఎన్నో ఎదురవుతాయి. వారు ఎంత ప్రయత్నించినా అనుకున్న స్థాయికి చేరుకోలేరు. కానీ 35 ఏళ్లు దాటిన తర్వాత మాత్రం వీరి పరిస్థితి మారిపోతుంది. వారి ప్రతిభను గుర్తించేలా అవకాశాలు ఎదురొస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.