Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి 35 ఏళ్లు దాటిన తర్వాత విజయం రావడం పక్కా

Published : Dec 23, 2025, 06:21 PM IST

Birth Date:  కొంత మందికి విజయం ఆలస్యంగా వస్తుంది. న్యూమరాలజీ ప్రకారం, కొన్ని ముఖ్య తేదీల్లో పుట్టిన వారికి 35 ఏళ్ల తర్వాత జీవితంలో గొప్ప విజయం సాధిస్తారు. 

PREV
14
Birth Date

కొంత మందికి విజయం అంత సులభంగా రాదు. విజయాన్ని రుచి చూడటానికి వారికి సంవత్సరాల తరబడి కష్టపడాల్సి రావచ్చు. వారి స్నేహితులు, సహోద్యోగులు చిన్న వయసులోనే విజయంలో సాధించినా.. కొన్ని తేదీల్లో పుట్టిన వారు మాత్రం 35 ఏళ్లు దాటిన తర్వాత ఆ విజయాన్ని రుచి చూస్తారు. మరి, ఆ తేదీలేంటో చూద్దాం....

24
నెంబర్ 3...

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. వారు తమ ప్రతిభను మాత్రమే నమ్ముకుంటారు. కానీ, వీరు ఎంత కష్టపడినా తొందరగా సక్సెస్ అవ్వలేరు. వీరి వయసు 35 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే వీరిని విజయం వరిస్తుంది. ఆ విజయం పొందడానికి వీరు చాలా కష్టపడతారు. కష్టం తర్వాత వచ్చిన ఈ విజయం చిరకాలం ఉంటుంది.

34
నెంబర్ 4...

ఏఏ నెలలో అయినా 3, 13, 22 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు. వీరికి కూడా జీవితంలో సక్సెస్ అంత ఈజీగా రాదు. వీరిని కేతువు పాలిస్తూ ఉంటాడు. అందుకే.. వీరు తమను తాము ఆత్మ పరిశీలన చేసుకోవడానికే ఎక్కువ సమయం తీసుకుంటారు. అందుకే... వీరికి విజయం లభించడానికి ఎక్కువ సమయం పడుతుంది

నెంబర్ 8...

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి కూడా 35 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే విజయం వరిస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన వారి పై శని గ్రహం పాలిస్తుంది. అందుకే, ఈ రాశివారికి ఎక్కువ ఆటంకాలు వస్తాయి. వాటిని అధిగమించి.. విజయానికి చేరువ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ..కచ్చితంగా విజయం సాధిస్తారు. అందుకోసం వీరు తమ కష్టాన్ని, క్రమశిక్షణను మాత్రం నమ్ముకోవాలి.

44
నెంబర్ 9...

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు పరిపూర్ణత, మానవత్వం, జ్ఞానానికి ప్రతీకగా ఉంటారు. అందుకే, వారు విజయం సాధించడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. 35 ఏళ్ల వయస్సు తర్వాత, వారి విజయాలు కచ్చితంగా ఆకట్టుకునేలా, దీర్ఘకాలం పాటు నిలిచి ఉండేలా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories