నెంబర్ 1..
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి సూర్యుని శక్తి ఉంటుంది. వీరిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఈ నాయకత్వ లక్షణాలను ఇతరుల్లోనూ పెంపొందించడానికి వీరు చాలా కృషి చేస్తారు. వీరు తొందరగా ఎవరి జీవితాల్లో వేలు పెట్టరు. కానీ... ఒక్కసారి ఎవరి మీద అయినా ప్రత్యేక దృష్టి పెట్టారు అంటే.. వారి జీవితాన్ని ఆనందంగా మార్చడానికి వారివంతు కృషి చేస్తారు. స్వతంత్రంగా ఆలోచించేలా, జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవడం ఎలానే నేర్పిస్తారు. ఎదుటివారిలో ఆత్మవిశ్వాసం పెంచుతారు. లైఫ్ కి ఒక కొత్త వెలుగు తీసుకువస్తారు. ఇలాంటి వాళ్లు మీ లైఫ్ లోకి వస్తే... అస్సలు వదులుకోవద్దు.