జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి సంచారం మన జీవితాల్లో ఆకర్షణ, ప్రేమ సంబంధాలు, కళల పట్ల ఆసక్తి, ఆర్థిక ఆవిష్కరణలు మొదలైన వాటిని ప్రభావితం చేస్తుంది. కొన్ని రాశుల వారికి ఇది వరమైతే, మరికొందరికి పరీక్షగా మారుతుంది. నవంబర్ నెలలో శుక్రుడు వృషభ రాశివారిపై ప్రత్యేక అనుగ్రహం చూపిస్తాడు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. భవిష్యత్తులో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం దక్కుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుంది