Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!

Published : Oct 13, 2025, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 13.10.2025 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం దక్కుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి సమస్యలు వస్తాయి. సన్నిహితులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరిగిపోతాయి. 

413
మిథున రాశి ఫలాలు

ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన, గృహ యోగం ఉంది. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసివస్తాయి.  

513
కర్కాటక రాశి ఫలాలు

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారాలు లాభదాయకం. 

613
సింహ రాశి ఫలాలు

దైవ సంబంధిత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఇంటా బయటా సమస్యలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిన్న పాటి సమస్యలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి.

713
కన్య రాశి ఫలాలు

పిల్లల చదువు విషయాల్లో ఊహించని సమస్యలు వస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆందోళన తప్పదు. ఆత్మీయులతో అకారణంగా వివాదాలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు చికాకు తెప్పిస్తాయి.

813
తుల రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూల సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతానానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోదాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త పరిచయాల వల్ల ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

దూర ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. చేపట్టిన పనులు అనుకున్న టైంకి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. బంధు మిత్రుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి.

1113
మకర రాశి ఫలాలు

వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

1213
కుంభ రాశి ఫలాలు

భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

1313
మీన రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో శ్రమ అధికమవుతుంది. ఇతరులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దాయాదులతో స్థిరాస్తి సంబంధిత సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories