Birth Date: సంఖ్యా శాస్త్రం చెబుతున్న ప్రకారం కొన్ని తేదీలలో జన్మించిన వారు ఇతరుల చేతిలో త్వరగా మోసపోతారు. అలాంటివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని న్యూమరాలజీ చెబుతుంది. ఏ తేదీలలో జన్మించిన వారికి ఇలా మోసపోయే గుణం అధికంగా ఉంటుందో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యాశాస్త్రం ప్రత్యేకమైనది. గ్రహాలు మారుతున్న కదలికలను బట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రజల జీవితాల్లో వచ్చే మార్పులను అంచనావేసి చెబుతుంది. అయితే సంఖ్యా శాస్త్రం మూల సంఖ్య ద్వారా ఒక వ్యక్తి లక్షణాలు, జీవితం, వ్యక్తిత్వం ఎలా ఉంటాయో అంచనా వేసి చెబుతుంది. ఇక్కడ మేము త్వరగా ఇతరుల చేతుల్లో మోసపోయే వారి గురించి చెబుతున్నాము. కొన్ని తేదీలలో జన్మించిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు త్వరగా మోసపోతారు.
24
ఈ తేదీలలో జన్మించిన వారు
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 2,11, 20,29 తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 2 అవుతుంది. ఈ రెండు సంఖ్యలో పాలించేది చంద్రుడు. చంద్రుడు ఎప్పుడూ ఉల్లాసంగా, సౌమ్యంగా ఉంటాడు. అలాగే ఇతరులను ఆకర్షిస్తాడు. ఈ తేదీలలో జన్మించిన వారు కూడా అంతే. వీరు బయటికి కఠినంగా కనిపించినా కూడా స్వభావ రీత్యా చాలా నెమ్మదిగా ఉంటారు. త్వరగా భావోద్వేగానికి లోనైపోతారు. చిన్నపిల్లల్లాగా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. అలాగే ముక్కు సూటితనంగా కూడా ఉంటారు. ఇతరులను మోసం చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు.
34
త్వరగా మోసపోతారు
రెండు మూల సంఖ్యగా కలిగిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి స్వభావం వల్ల ఇతరుల మాటలకు త్వరగా లోనవుతారు. దీనివల్ల త్వరగా మోసపోయే అవకాశం ఉంది. ఎవరైనా కూడా వీరిని మాటలతో బోల్తా కొట్టించి మోసం చేయవచ్చు. స్నేహితుల దగ్గర నుంచి తెలియని వారి వరకు ఎవరి చేతిలోనైనా 2 మూల సంఖ్య కలిగిన వారు సులువుగా మోసానికి గురవుతారు. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
రెండు బొమ్మల సంఖ్య కలిగిన వారు రెండు మంత్రాలను క్రమం తప్పకుండా చెప్పించాలి. అందులో మొదటిది ‘ఓం సోం సోమే నమః’. ఈ మంత్రం ఎంత శక్తివంతమైనదంటే చాలా మానసిక ప్రశాంతతతో పాటు భావోద్వేగ స్థిరత్వాన్ని అందిస్తుంది. జీవితంలోని ప్రతికూలతలను తొలగించి సమతుల్యంగా ఉండేలా చూస్తోంది. ఇక రెండవ మంత్రం శివుడికి చెందిన ‘ఓం నమః శివాయ’ ఈ మంత్రం మనసుకి బలాన్ని అందిస్తుంది. తరచూ ఈ మంత్రాలను జపిస్తే ఈ తేదీలలో పుట్టినవారికి జీవితం ఆనందంగా సాగుతుంది.