పుట్టిన తేదీ 23...
ఏ నెలలో అయినా 23వ తేదీలో జన్మించిన వారిపై బుధుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తెలివితేటలు, చురుకుదనం, హాస్యాన్ని సూచిస్తుంది. ఈ రోజున పుట్టినవారు ఉల్లాసమైన స్వభావం, చమత్కారమైన మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. వయసు పెరిగినా వీరి హాస్యం, ఆటపాటల పట్ల ఆసక్తి, విశాల దృక్పథం ఎప్పటికీ తగ్గదు. అందుకే వీరి వయసు తెలుసుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు. వీరి మానసిక చురుకుదనం వీరిని ఎప్పటికీ యవ్వనంగా ఉంచుతుంది.