Sun venus Conjuction: దీపావళి వస్తూ వస్తూ ఈ మూడు రాశుల జీవితాల్లో వెలుగులు, పెరగనున్న అదృష్టం

Published : Oct 02, 2025, 09:10 AM IST

sun venus conjuction: వేద జోతిష్య శాస్త్రం ప్రకారం, తుల రాశిలో సూర్యుడు, శుక్ర గ్రహాల కలయిక జరగనుంది. ఈ ప్రత్యేక కలయిక మూడు రాశుల వారికి అదృష్టాన్ని మోసుకురానుంది. సమాజంలో వారి ప్రతిష్టను పెంచుతుంది. 

PREV
14
దీపావళికి అదృష్ట రాశులు...

జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఈ అక్టోబర్ నెలలో దీపావళి పర్వదినం సమయంలో కూడా ఇలాంటి మార్పులు జరగనున్నాయి. సూర్యుడు, శుక్ర గ్రహం రెండూ తుల రాశిలో కలవనున్నాయి. సూర్యుడిని గౌరవం, ప్రతిష్టకు చిహ్నంగా పరిగణిస్తారు. అయితే... శుక్రుడు సంపద, శ్రేయస్సు, విలాసాన్ని ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు. ఈ అరుదైన కలయిక కొన్ని రాశులకు మంచి సమయాన్ని తేనుంది. ఊహించని ఆర్థిక లాభాలతో పాటు... కెరీర్ లో పురోగతి ఉంటుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా.....

24
1.ధనస్సు రాశి....

సూర్యుడు, శుక్ర గ్రహం కలయిక ధనస్సు రాశివారి జీవితానికి సానుకూల మార్పులు తీసుకురానుంది. ఈ కలయిక ధనస్సు రాశి 11వ ఇంట్లో జరుగుతుంది. కాబట్టి... ఈ సమయంలో ఈ రాశివారి ఆదాయం చాలా ఎక్కువగా పెరగనుంది. కొత్త ఆదాయ వనరులు కూడా వస్తాయి. జీవితం పూర్తిగా మారిపోయిన ఫీలింగ్ వస్తుంది. జీవితం సానుకూలంగా మారుతుంది. ప్రకృతి కూడా మీకు సహకరించిన అనుభూతి కలుగుతుంది. వ్యాపారస్తులకు కూడా లాభాలు కలుగుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. స్టాక్ మార్కెట్స్ ద్వారా కూడా డబ్బు సంపాదించగలరు.

34
2.కుంభ రాశి...

తుల రాశిలో శుక్రుడు, సూర్యుడి కలయిక కుంభ రాశి వారి జీవితంలో చాలా మార్పులు తీసుకురానుంది. ఈ కలయిక కారణంగా.. తుల రాశివారికి అదృష్టం పెరుగుతుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇల్లు, ఆస్తి లాంటివి కొనే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆనందం పెరుగుతుంది. మనశ్శాంతిగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

44
3.మకర రాశి...

తుల రాశిలో సూర్యుడు, శుక్రుడి కలయిక కెరీర్ , వ్యాపార పరంగా మకరరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కలయిక మీ రాశిలో, కెరీర్, వ్యాపార రంగంలో ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సమయం మీ పనిలో మంచి పురోగతిని తెస్తుంది. అదనంగా, కార్యాలయంలో జరుగుతున్న సమస్యలు తొలగిపోతాయి, ఇది మీ పనిపై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వ్యాపారవేత్తలు కొత్త ఆర్డర్‌ల కారణంగా వారి వ్యాపారంలో గణనీయమైన లాభాలను చూడవచ్చు. అలాగే, పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు కూడా ఆర్థిక లాభాలను పొందవచ్చు. అంతేకాకుండా, ఈ సమయంలో మీ తండ్రితో మీ సంబంధం బాగుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories