పుట్టిన తేదీ ఆధారంగా మన లక్షణాలు, జీవన శైలి, అభివృద్ధి, ఆర్థిక స్థితి వంటి అంశాలను సంఖ్యాశాస్త్రం అంచనా వేస్తుంది. ఈ శాస్త్రం ప్రకారం ప్రతి సంఖ్యకు ఒక గ్రహాధిపత్యం ఉంటుంది. కొన్ని సంఖ్యలు జీవితంలో డబ్బు, గౌరవం, విజయాన్ని ప్రసాదిస్తాయని నమ్ముతారు. అలాంటి శక్తివంతమైన సంఖ్యల్లో ఒకటి నెంబర్ 6. ఈ సంఖ్య శుక్రునికి సంబంధించింది. శుక్రుడు.. అందం, ప్రేమ, విలాసం, ధనం వంటి అంశాలకు కారకుడు. అందువల్లే 6, 15, 24 తేదీల్లో పుట్టినవారు జీవితంలో ధనవంతులు అవుతారని న్యూమరాలజీ చెబుతోంది.