జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశిలో అయినా గ్రహాల కలియిక ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. అవి అనుకూల ఫలితాలు కావచ్చు. ప్రతికూల ఫలితాలు కావచ్చు. మీన రాశిలో పంచగ్రహ కూటమి మార్చి 29 రాత్రి ఏర్పడింది. దీని వల్ల 5 రాశులవారికి అశుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ రాశులెంటో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి వారిపై పంచగ్రహ ప్రభావం?
పంచగ్రహ కూటమి ప్రభావంతో మేష రాశి వారి జీవితంలో ఆటంకాలు వస్తాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో బాధపడతారు. ఉద్యోగులు ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి.
మిథున రాశి వారిపై ప్రభావం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మిథున రాశి వారికి వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇంట్లో ఆడపిల్లలకు ఇబ్బందులు వస్తాయి. పాత అప్పుల వల్ల టెన్షన్ పెరుగుతుంది. పెళ్లయిన వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటారు.
కన్య రాశి వారిపై పంచగ్రహ కూటమి ప్రభావం?
మీన రాశిలో పంచగ్రహ కూటమి కన్య రాశి వారికి అస్సలు మంచిది కాదు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి. ప్రేమలో ఉన్న వాళ్ల బంధం తెగిపోవచ్చు. పాత అప్పుల వల్ల వ్యాపారులు ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు మానసిక ఒత్తిడి అధికమవతుంది.
వృశ్చిక రాశి ఫలితాలు..
పంచగ్రహ కూటమి ప్రభావం ఏప్రిల్ 13, 2025 వరకు వృశ్చిక రాశి వారిపై ఉంటుంది. కొందరు పని చేయడానికి ఇష్టపడరు. డబ్బు గురించి టెన్షన్ పడతారు. గతంలో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఇప్పుడు ఇబ్బంది పడతారు. ఇంట్లో గొడవలవుతాయి. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది.
మీన రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
మీన రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల వారికి చాలా సమస్యలు వస్తాయి. ఏప్రిల్ 13, 2025 వరకు ఎవరి దగ్గరా అప్పు చేయకపోవడం మంచిది. ఒకవేళ చేస్తే తిరిగి చెల్లించలేరు. 65 ఏళ్లు పైబడిన వాళ్లు ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి.