జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు.. సంతోషం, మనస్సు, నైతికత లాంటి వాటికి ప్రతీకగా చెప్పుకుంటారు. నిర్దిష్ట కాలం తర్వాత చంద్రుడు రాశిని మారుస్తుంటాడు. దీనివల్ల 12 రాశుల జీవితాల్లో మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రావచ్చు. 2025 మార్చి 30 సాయంత్రం చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల 3 రాశులవారికి అదృష్టం కలిసివస్తుందట. ఆ రాశులెంటో వారికి కలిగే ప్రయోజనాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.
వృషభ రాశికి ఎలా ఉండనుంది?
చంద్రుడి కదలికలో మార్పు వల్ల వృషభ రాశి వారి జీవితంలో సంతోషం వస్తుంది. బంధుత్వాల్లో ఉన్న సమస్యలు దూరమవుతాయి. కుటుంబ సభ్యుల్లో ప్రేమ పెరుగుతుంది. గతంలో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే తిరిగి చెల్లిస్తారు. వ్యాపారులు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.
కర్కాటక రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
కర్కాటక రాశి వాళ్లకు చంద్రుడు బలంగా ఉండటం వల్ల జీవితంలో ముందుకు వెళ్లే అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేసేవాళ్లకు చాలా లాభాలు వస్తాయి. అప్పులు తీర్చడానికి ఇది మంచి సమయం. ఉద్యోగం చేసేవాళ్లకు పెద్ద కంపెనీలో పనిచేసే అవకాశం వస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
ధనుస్సు రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుస్సు రాశి వారికి ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. దీనివల్ల భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవాళ్లకు ఆర్థికంగా లాభం చేకూరే అవకాశం ఉంది. కొత్త వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పెళ్లి కాని వాళ్లకు సంబంధాలు వస్తాయి. పెళ్లైన వాళ్ల జీవితం సంతోషంగా ఉంటుంది.