ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్తాన్ తన చర్యల వల్లే ఇబ్బందుల్లో పడుతోంది. పాకిస్తాన్ ఆది నుంచి అన్నింటిలోనూ విఫలమవుతూనే వస్తుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ జాతకం పైన సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. పాక్ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పాకిస్తాన్ దేశం 1947 ఆగస్టు 14 న ప్రత్యేక దేశంగా ఏర్పాటయింది. పాకిస్తాన్ వ్యవస్థాపక సమయం ప్రకారం పాకిస్తాన్ జాతకం మేష లగ్నానికి చెందినదని చెబుతున్నారు. ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తోంది. దీని ప్రభావంతో పాకిస్తాన్ ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా ఆర్థిక సాయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
24
భారత్ పాకిస్తాన్ యుద్దం
పాకిస్థాన్ కు శుక్ర మహాదశ చాలాకాలం ఉంటుంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. ప్రస్తుతం బుధుడి అంతరదశ కూడా ప్రభావితం చేస్తోంది. బుధుడు చంద్ర రాశిలో ఉండటం పాకిస్తాన్‌కు కష్టాలు తెచ్చిపెడుతుంది. శుక్ర, బుధుల కలయిక పాకిస్తాన్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెడుతుంది.
34
భారత్ పాకిస్తాన్ యుద్దం
సూర్యుడి వల్ల సమస్యలు: పాకిస్తాన్ జాతకంలో సూర్య మహాదశతో పాటు కేతు అంతరదశ కూడా నడుస్తోంది. సూర్య, కేతువుల కలయిక గ్రహణ యోగాన్ని సృష్టిస్తోంది. దీంతో పాకిస్తాన్ తన మిత్రదేశాల నుంచి కూడా మోసపోయే అవకాశం ఉంది.
పాకిస్తాన్ జాతకంలో శుక్ర, బుధ, సూర్యులు ప్రతికూల యోగాన్ని ఏర్పరుస్తున్నారు. శుక్రుడు శత్రు రాశి అయిన కర్కాటక రాశిలో శనితో కలిసి ఉన్నాడు. ఇది పాకిస్తాన్‌కు హానికరం.