Numerology: న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, జీవిత ప్రయాణంపై అంచనాలు వేయవచ్చని నమ్మకం. ముఖ్యంగా కొన్ని తేదీల్లో జన్మించిన వారికి ప్రేమ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు.
ఒక వ్యక్తి పుట్టిన తేదీలోని అంకెలను కలిపితే వచ్చే సంఖ్యను రాడిక్స్ నంబర్ అంటారు. ఉదాహరణకు 12 తేదీన పుట్టిన వ్యక్తికి 1+2 = 3. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారందరికీ రాడిక్స్ నంబర్ 3గా పరిగణిస్తారు. ఈ సంఖ్య ఆధారంగా వ్యక్తిత్వ లక్షణాలను అర్థం చేసుకోవచ్చని న్యూమరాలజీ చెబుతుంది.
24
సంఖ్య 3కు అధిపతి ఎవరు?
రాడిక్స్ నంబర్ 3కు గురుగ్రహం అధిపతి. గురువు ప్రభావం ఉన్న వ్యక్తుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, స్పష్టమైన ఆలోచనలు కనిపిస్తాయి. వీరు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎదుటివారిని ప్రభావితం చేసే మాటతీరు ఉంటుంది. అయితే భావోద్వేగ విషయాల్లో మాత్రం అంత స్థిరంగా ఉండలేరని చెబుతారు.
34
ప్రేమ వ్యవహారాల్లో ఎదురయ్యే సమస్యలు
రాడిక్స్ నంబర్ 3 ఉన్న వ్యక్తులు ప్రేమ విషయంలో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వారి ప్రేమ సంబంధాలు ఎక్కువ కాలం నిలవవని న్యూమరాలజీ సూచిస్తుంది. భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తడం, అనవసరమైన అపార్థాలు రావడం సాధారణం. కొన్ని సందర్భాల్లో ప్రేమలో మోసపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతారు. ఈ కారణాల వల్ల వీరు ఎక్కువ కాలం ఒంటరిగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి ఆలస్యంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ప్రేమ జీవితంలో సమస్యలు ఎదురైనా వివాహ జీవితం మాత్రం ప్రశాంతంగా సాగుతుందని న్యూమరాలజీ వివరిస్తుంది. పెళ్లి తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారు. సంఖ్య 3 ఉన్న వ్యక్తులు సృజనాత్మకతతో నిండివుంటారు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. పట్టుదల వీరి బలమైన ఆయుధం. అదే లక్షణం కెరీర్‌లో విజయానికి కారణమవుతుంది.
గమనిక: ఇక్కడ తెలిపిన విషయాలు న్యూమరాలజీ నమ్మకాల ఆధారంగా అందినవి మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకులు సమాచారంగా మాత్రమే వీటిని పరిగణించాలి.