జోతిష్యశాస్త్రం ప్రకారం,గ్రహాల రాజు అయిన సూర్యుడు ఫిబ్రవరి నెలలో తన స్థానాన్ని మూడుసార్లు మార్చుకుంటాడు. గౌరవానికి, ప్రతిష్ఠకు ప్రతీక అయిన సూర్యుడు ఫిబ్రవరి 6వ తేదీన ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత, ఫిబ్రవరి 13వ తేదీన సూర్యుడు మకర రాశిని వదిలి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.చివరగా, ఫిబ్రవరి 19వ తేదీన సూర్యుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అంటూ.. ఒకే నెలలో సూర్యుడు తన స్థానాన్ని మూడు సార్లు మార్చుకుంటాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాగలదు. వారు పదవిని, ప్రతిష్ఠను కూడా పొందుతారు. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం....