Zodiac signs: గ్రహాలకు అధిపతిగా పేరున్న బుధుడు 2026 జనవరి 17న మకర రాశిలోకి ప్రవేశించాడు. ఫిబ్రవరి 3 వరకు ఈ రాశిలోనే సంచరిస్తాడు. బుధ గోచారం ప్రభావం అన్ని రాశులపై పడినా… కొన్ని రాశులకు మాత్రం ప్రత్యేక ఫలితాలు ఇవ్వనుంది.
మకర రాశికి అధిపతి శని దేవుడు. శని బుధుల మధ్య స్నేహ సంబంధం ఉంటుంది. ఈ కారణంగా మకర రాశిలో బుధుడు ఉన్న సమయంలో బుద్ధి, క్రమశిక్షణ, ఓర్పు, ప్రాక్టికల్ ఆలోచనల సమ్మేళనం కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో ఆలోచనతో అడుగులు వేయాలనే ధోరణి బలపడుతుంది.
25
బుధ గోచారంతో లాభపడే 3 రాశులు
బుధుడు మకరంలోకి రావడంతో 12 రాశులపై ప్రభావం ఉంటుంది. అయితే మూడు రాశుల వారికి ఈ గోచారం అత్యంత శుభఫలితాలు ఇస్తుంది. ఈ రాశుల వారికి కెరీర్‌లో ఎదుగుదల, వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. జీవితంలో కొత్త అవకాశాలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి.
35
మేష రాశి వారికి కెరీర్‌లో కొత్త దారి
మేష రాశికి బుధుడు పదవ స్థానంలో గోచరిస్తున్నాడు. ఈ స్థానం ఉద్యోగం, అధికార రంగం, తండ్రి సహకారాన్ని సూచిస్తుంది. మేష రాశి వారికి పనిలో పురోగతి కనిపిస్తుంది. ఉన్నతాధికారుల మద్ధతు లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ఫలితం సానుకూలంగా ఉంటుంది
వృషభ రాశికి బుధుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు. ఈ సమయంలో చేసే ప్రయత్నాలకు అదృష్టం తోడుగా ఉంటుంది. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు మళ్లీ ముందుకు కదులుతాయి.
55
మకర రాశి వారికి ధన లాభం
మకర రాశికి బుధుడు లగ్నస్థానంలో గోచరిస్తున్నాడు. ఇది శరీరం, మాటతీరు, వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మకర రాశి వారికి ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటకు విలువ పెరిగే కాలం ఇది.
గమనిక: పైన తెలిపిన విషయాలను ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం, పలువురు పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.