Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం!

Published : Jun 01, 2025, 01:54 PM IST

సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి మూల సంఖ్య కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. కొన్ని సంఖ్యలు లాభాలు కలిగిస్తే.. మరికొన్ని సంఖ్యలు నష్టాలు కలిగించవచ్చు. న్యూమరాలజీ ప్రకారం మూలసంఖ్య 7 కలిగిన వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
మూల సంఖ్య 7

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 7. మూల సంఖ్య 7 కలిగిన వ్యక్తులు వారికి నచ్చినట్లు బ్రతకడానికి ఇష్టపడతారు. ఈ తేదీల్లో జన్మించిన వారు ఎవరిమీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు.

26
కష్టపడే వ్యక్తిత్వం

మూల సంఖ్య 7 కలిగిన వ్యక్తులు కష్టజీవులు. ఏ పని చేయడానికైనా వెనుకాడరు. విధి వీరికి ఎప్పుడూ అండగా ఉంటుంది. తమ తెలివితేటలతో కష్టమైన పనులను సైతం సులభంగా పూర్తి చేస్తారు. అందరి మన్ననలు పొందుతారు.   

36
వీరిని అంచనా వేయడం కష్టం

మూల సంఖ్య 7 కలిగిన వ్యక్తులు తొందరగా ఎవరితో కలిసిపోరు. తమ ఆలోచనలను అందరితో పంచుకోరు. వారి మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరి మానసిక స్థితిని ఎవరూ అంచనా వేయలేరు.

46
సంపద, కీర్తి

మూల సంఖ్య 7 కలిగిన వ్యక్తులు జీవితంలో సంపద, కీర్తిని పొందుతారు. కృషితో వృత్తిలో గౌరవం, అభివృద్ధిని సాధిస్తారు. వారు ఆత్మవిశ్వాసంతో, ఓర్పుతో ఉంటారు. ఈ గుణాలే వారికి అన్నింట్లో విజయాన్ని తెచ్చి పెడతాయి.

56
ఈ సంఖ్యకు అధిపతి కేతువు

మూల సంఖ్య 7 కు అధిపతి కేతువు. ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు తాత్వికంగా, ఆలోచనాత్మకంగా ఉంటారు. వీరు ఎప్పుడూ ఏదో ఒకటి అన్వేషిస్తూ ఉంటారు. వారు అనుకున్నది సాధించేవరకు నిద్రపోరు.

66
స్నేహం కోసం

ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారికి.. మూల సంఖ్య 5, 6 కలిగిన వ్యక్తులు మంచి స్నేహితులవుతారు. సాధారణంగా మూలసంఖ్య 7 కలిగిన వ్యక్తులు అందరితో స్నేహం చేయరు. ఎవరితో స్నేహం చేస్తారో వారి కోసం ఏమైనా చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories