Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ప్ర‌తీది భూత‌ద్దంలో చూస్తారు.. వీరితో ప్రేమ కాస్త క‌ష్ట‌మే

Published : Mar 18, 2026, 10:42 AM IST

Numerology: న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం ప్రతి వ్యక్తి జన్మతేదీకి ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. ఆ తేదీ నుంచి లభించే మూల సంఖ్య మ‌న గురించి చెబుతుంద‌ని న‌మ్ముతారు. అలా కొన్ని సంఖ్యలు కలిగిన మహిళలు ప్ర‌తీ విష‌యాన్ని ఎక్కువ ఆలోచిస్తార‌ని చెబుతున్నారు. 

PREV
15
ఇంత‌కీ మూల సంఖ్య అంటే ఏంటి? ఎలా లెక్కించాలి?

పుట్టిన తేదీని ఒక అంకెకు చేర్చితే వచ్చే సంఖ్యనే మూల సంఖ్య అంటారు. ఉదాహరణకు 14 తేదీకి 1+4 = 5 అవుతుంది. ఈ సంఖ్య మన వ్యక్తిత్వానికి ఒక దారిని చూపుతుంది. ఆలోచనలు, నిర్ణయాలు, ప్రవర్తనలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

25
మూల సంఖ్య 3 ఉన్న వారి ఆలోచ‌న‌లు

3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు మూల సంఖ్య 3 కిందికి వ‌స్తారు. ఈ తేదీల్లో జ‌న్మించిన‌ మహిళలు తెలివిగా, చురుకుగా ఉంటారు. ఏ విషయం గురించైనా లోతుగా విశ్లేషించడం వీరి ప్రత్యేకత. కానీ సాధారణ విషయాన్నే పెద్ద సమస్యగా తీసుకుని దానిపై ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉంటుంది. వీరి మెదడు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం వల్ల విశ్రాంతి తీసుకోవడం కష్టమవుతుంది. ప్రతి విషయం మీద స్పష్టత కావాలనుకోవడం వల్ల, ఒక సందేహం వచ్చినప్పుడు దానిపై మళ్లీ మళ్లీ ఆలోచిస్తారు.

35
సంఖ్య 5: ఒత్తిడి పెంచే ఆలోచనలు

5, 14, 23 తేదీల్లో పుట్టిన స్త్రీలు వేగంగా ఆలోచించే వారు. సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కారం కనుగొనాలని ప్రయత్నిస్తారు. వారి మాటలు, నిర్ణయాలు సాధారణంగా లాజిక్ ఆధారంగా ఉంటాయి. అయితే, చిన్న విషయాన్నీ పెద్దగా తీసుకోవడం వల్ల అనవసరంగా టెన్షన్ పెరుగుతుంది. భావోద్వేగాలకు లోనవడం కూడా ఎక్కువ. తమ భావాలను ఇతరులతో పంచుకోవాలనుకునే స్వభావం ఉండటం వల్ల, అర్థం కాలేదనిపిస్తే అదే విషయాన్ని పలుమార్లు చెబుతారు. దీంతో వీరి భాగ‌స్వాముల‌తో త‌ర‌చూ ఈ విష‌యాల్లో గొడ‌వ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంటుంది.

45
సంఖ్య 7: లోతైన ఆలోచనలు, అంతర్గత గందరగోళం

7, 16, 25 తేదీల్లో జన్మించిన మహిళలు బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం నిరంతరం ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. వీరి ఆలోచనలు చాలా లోతైనవే. ఒక విషయం మీద అనుమానం వచ్చినప్పుడు, దానికి సమాధానం దొరకేవరకు ఆలోచిస్తూ ఉంటారు. ఈ స్వభావం వల్ల ఎక్కువగా ఆందోళన, మానసిక ఒత్తిడి ఎదురవుతుంది.

55
ఇలాగే కొన‌సాగితే ఒత్తిడి ఖాయం

3, 5, 7 సంఖ్యలు కలిగిన మహిళల్లో లోతైన ఆలోచన శక్తి ఉంటుంది. సమస్యలను ముందుగానే అంచనా వేసే సామర్థ్యం వీరికి ప్లస్ పాయింట్. కానీ అదే అలవాటు అధికంగా మారితే మానసికంగా అలసట, ఒత్తిడి పెరుగుతాయి.

అందుకే ఈ సంఖ్యలవారు ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ముఖ్యం. ఆలోచన అవసరం ఉన్నప్పుడు చేయాలి, కానీ అవసరం లేని సమయంలో మనసుకు విశ్రాంతి ఇవ్వడం కూడా అంతే ముఖ్యమైనది. రిలాక్సేషన్, హాబీలు, మంచి సంభాషణలు ఇవన్నీ మనసును హాయిగా ఉంచడంలో సహాయపడతాయి.

గ‌మ‌నిక‌: న్యూమ‌రాల‌జీ అనేది కేవ‌లం ఒక శాస్త్రం ఆధారంగా తెలిపే విష‌యాలు మాత్ర‌మే. మీ పుట్టిన తేదీ ఏదైనా కావచ్చు, కానీ ఆలోచనలపై నియంత్రణ సాధించడం జీవితాన్ని సులభంగా మార్చుతుంది. సంఖ్యలు ఒక మార్గదర్శకం మాత్రమే, మన నిర్ణయాలే అసలు భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని గుర్తించాలి.

Read more Photos on
click me!

Recommended Stories