ఉగాది తర్వాత మీన రాశివారి జీవితం ఎలా మారనుందంటే...
1. కెరీర్ , ఉద్యోగం (Career):
అద్భుతమైన వృద్ధి: ఉద్యోగస్తులకు పదోన్నతులు (Promotions), వేతన పెరుగుదల ఖాయం. మీరు చేసే పనికి అధికారుల నుండి పూర్తి ప్రశంసలు లభిస్తాయి. ఐటీ , బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి విదేశీ అవకాశాలు తలుపు తడతాయి.
వ్యాపారం: నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది గోల్డెన్ టైమ్. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
విద్యార్థులు: విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి.
2. ఆర్థిక స్థితి (Finance):
ధన యోగం: ఈ ఏడాది ఆదాయం (12) వ్యయం (12) గా ఉంది. ఆదాయం ఎంత బాగుంటుందో, అంతే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయి. అయితే, ఈ ఖర్చులు ఎక్కువగా ఆస్తుల కొనుగోలు లేదా శుభకార్యాల కోసమే అవుతాయి.
పెట్టుబడులు: షేర్ మార్కెట్ , రియల్ ఎస్టేట్‌లో పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి లాభాలను ఇస్తాయి. పాత అప్పులు తీర్చివేసి ఊపిరి పీల్చుకుంటారు.