చదువు పూర్తి చేసిన వారికి బుధుడి వల్ల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అందుకే బుధుడి సంచారం జాతకంలో ఎంతో ముఖ్యమైనది. బుధుడు జ్ఞానం, కమ్యూనికేషన్, వ్యాపారం, వృత్తి జీవితంతో ముడిపడి ఉంటాడు. 2025 అక్టోబర్‌లో బుధుడి సంచారం ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. బుధుడు తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడి సంచారం వల్ల అనేక రాశుల వారికి వృత్తిపరమైన పురోగతిని అందిస్తుంది. అలాగే కొత్త ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి. అక్టోబర్లో జరిగే మార్పుల వల్ల మేషం, సింహం, తుల, వృశ్చిక రాశి వారికి ఎన్నో గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది.