Rashmika Vijay Devarakonda: రష్మిక మందన్నా జాతకంలో ఈ అద్భుతమైన యోగం, దానివల్ల విజయ దేవరకొండకు అదృష్టం

Published : Oct 04, 2025, 12:22 PM IST

ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఆమె జాతకంలో ఉన్న అద్భుతమైన యోగం వల్లే ఆమె ఒక్కో సినిమాకు ఆరు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి చేరుకుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. 

PREV
15
ఒక్కో సినిమా రెమ్యునరేషన్

సినీ పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర కథానాయిక ఎవరంటే రష్మిక మందన్న పేరే వినిపిస్తోంది. ఆమె ప్రస్తుతం ఒక్కో సినిమాకి 6 కోట్ల రూపాయల నుంచి ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటోందని అంచనా. ఆమె ఈ స్థాయికి చేరడానికి అందం, నటన మాత్రమే కాదు.. ఆమె జాతకంలో ఉన్న అద్భుతమైన యోగం కూడా కలిసి వచ్చిందని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆమె జీవితంలో పెద్ద ప్రతికూలతలు కూడా ఎదురయ్యావని అవన్నీ అధిగమించడానికి శక్తివంతమైన పూజలు కూడా చేసిందని చెబుతున్నారు.

25
జాతకంలో దోషం ఉండడం వల్ల

రష్మిక మందన్నా మొదట కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఆ బంధం ఎంగేజ్మెంట్ దాకా చేరింది. వారిద్దరి జాతకాలను ప్రముఖ జ్యోతిష్యులు చూశారని చెబుతున్నారు. ఆ ఇద్దరు జాతకంలో దోషం ఉందని అందుకే వారిద్దరి పెళ్లి జరగలేదని కూడా చెబుతున్నారు. షష్ఠాష్టక దోషం ఉంటే అత్యంత అనుకూలతలేని జాతక కలయికగా చెప్పుకుంటారు. ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి ఇదే విషయంపై మాట్లాడుతూ ఈ షష్ఠాష్టక దోషం ఉన్నందున వారిద్దరూ విడిపోతేనే మంచిదని తాను చెప్పానని తెలిపారు. ఆ తర్వాత ఆమె ఎంగేజ్మెంట్ రద్దు చేసుకొని ఆ విషయాన్ని తన అభిమానులకు తెలియజేసింది. ఆమె జీవితంలో ఇది ఒక పెద్ద ప్రతికూలత గానే చెప్పుకోవాలి.

35
ఎన్నో పూజలు చేశాక

ఆ హీరోతో విడిపోయిన తర్వాత రష్మిక జాతకంలో ఉన్న అద్భుతమైన యోగం కారణంగా ఆమె ఊహించని స్థాయిలో మంచి సినిమాలు దొరికాయి. ఆ యోగాన్ని బలోపేతం చేసుకోవడానికి ఆమె రాజ్యశ్యామల పూజ, భగలాముఖి పూజ, తార వంటి శక్తివంతమైన పూజలను నిర్వహించినట్టు జ్యోతిష్కులు చెబుతున్నారు. ఆ పూజల ఫలితంగానే రష్మిక నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా మారిందని వివరిస్తున్నారు.

45
విజయ్ దేవరకొండకు ఎంతో మంచి

ఇప్పుడు రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే విజయ్ దేవరకొండ జాతకంలో శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడని... ఇది ఆయనకు వివాహంలో సమస్యలను కలిగిస్తుందని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. అయితే రష్మికలాంటి బలమైన యోగం కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తితో విజయ్ దేవరకొండ వివాహం అయితే ఆయనకు కూడా కొంతమేరకు దోషాలు తొలగిపోయే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

55
దోషం తొలగిపోయి

రష్మిక మందన్నా జాతకం అత్యద్భుతంగా ఉంది. ఆమె జాతకంలో అసాధారణ యోగాలు ఉన్నాయి. షష్ఠాష్టక దోషం కూడా పోయింది. అత్యంత శక్తివంతమైన పూజలు కూడా చేసింది. అందువల్ల ఆమె జీవితంలో అదృష్టం బలంగా ఉందని జ్యోతిష్కులు వివరిస్తున్నారు. ఈ అదృష్టం విజయదేవరకొండ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి తర్వాత రష్మిక జాతకంలో ఉన్న బలం వల్ల విజయ్ దేవరకొండకు కూడా విజయాలు దక్కే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నట్టు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories