Mercury Transit: మే7 తర్వాత నుంచి ఈ రాశుల కష్టాలు తీరినట్లే..!

Published : May 01, 2025, 02:00 PM IST

బుధ గ్రహం ప్రతి నెలకు ఒకసారి  రాశిని మార్చుకుంటూ ఉంటుంది.  మేలో ఈ గ్రహం మేష రాశిలోకి అడుగుపెట్టింది. ఈ మార్పులు మూడు  రాశులకు మేలు చేయనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా..

PREV
15
Mercury Transit: మే7 తర్వాత నుంచి ఈ రాశుల కష్టాలు తీరినట్లే..!
Mercury Transit

జోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహానికీ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి గ్రహం ఒకానొక సమయంలో రాశులను మార్చుకుంటూ ఉంటుంది. అలా రాశులను మార్చడం మానవ జీవితానికి, ముఖ్యంగా ఆ రాశులకు చెందిన వారికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.ఆ మార్పులు కొన్ని రాశులకు ఊహించని లాభాలు తెస్తే, మరి కొన్ని రాశులవారికి నష్టాలు కూడా తేవచ్చు. ఈ గ్రహాలన్నింటిలో బుధ గ్రహాన్ని తెలివి, జ్ఞానం,  స్నేహానికి సంబంధంచినదిగా భావిస్తారు. అలాంటి ఈ బుధగ్రహం మే నెలలో రాశిని మార్చుకోనుంది. దీని వల్ల మూడు రాశులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. 

25

బుధ గ్రహాన్ని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. ఈ గ్రహం ప్రతి నెలా రాశిని మార్చుకుంటూనే ఉంటుంది. బుధ గ్రహం ప్రస్తుతం మీన రాశిలో ఉన్నప్పటికీ, మే 7, 2025న మేష రాశిలోకి ప్రవేశిస్తుంది. బుధుడు మేష రాశిలోకి ప్రవేశించిన వెంటనే, మేష, కర్కాటక, తుల రాశులవారిని అదృష్టం వరించనుంది.

35
telugu astrology

1.మేష రాశి..

మేష రాశి వారికి బుధుని ప్రత్యేక అనుగ్రహం ఉంది. ఈ రాశి మార్పుతో మేష రాశి వారి ఉద్యోగ అన్వేషణ ముగుస్తుంది. అంటే వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన బదిలీ , జీతం పెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో ప్రణాళిక ప్రకారం పనిచేస్తే మంచి లాభాలు వస్తాయి.

45
telugu astrology

2.కర్కాటక రాశి..

కర్కాటక రాశి వారిపై సానుకూల ప్రభావం ఉంటుంది. వృత్తి , వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అప్పులు తీరుతాయి. మీ కీర్తి పెరుగుతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

55
telugu astrology

3.తుల రాశి..

తుల రాశి వారిపై సానుకూల ప్రభావం ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి సమయం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. పా స్నేహితులను మళ్లీ కలుసుకునే అవకాశం ఉంటుంది.  ఉద్యోగంలో అదనపు పనిభారం ఉండవచ్చు, అలాగే పదోన్నతి ,జీతం పెరుగుదల కూడా ఉండవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories