1.సంరక్షకులు...
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 అంటే.. 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు కుటుంబానికి సంరక్షకులుగా ఉంటారు. ముఖ్యంగా తమ తోడ పుట్టిన వారిపై అమితమైన ప్రేమ చూపిస్తారు. తమ తమ్ముడు, చెల్లెళ్లు, అక్క ఎవరైనా సరే.. వారి కోసం చాలా కష్టపడతారు. జీవితంలో తాము మాత్రమే సక్సెస్ కావడం కాదు, తమ తోడబుట్టిన వారు కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. వారి కోసం వీరు చాలా సహాయం చేస్తారు. ఆర్థికంగానూ, మానసికంగానూ అండగా నిలుస్తారు. ఇలాంటి బ్రదర్ ఉన్నవారి లైఫ్ ఆనందంగా ఉంటుంది.