Mercury Transit : బుధ సంచారం.. రాసి పెట్టుకోండి.. ఈ రాశుల వారికి అన్నీ శుభాలే !

Published : Jan 24, 2026, 11:24 PM IST

Mercury Transit : ఫిబ్రవరి 3న బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు కుంభ రాశిలో సంచరించడం వల్ల అనేక రాశుల వారికి కొత్త ఆరంభాలు లభిస్తాయి. ఈ గోచారం మేషం, మిథునం, సింహం, తులా, కుంభ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇవే

PREV
16
అదృష్టం అంటే వీరిదే.. కుంభ రాశిలో బుధుడి ఎఫెక్ట్ ఎవరిపై ఉంటుంది?

జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. బుధుడు బుద్ధి, మాట, తర్కం, వ్యాపారం, కమ్యూనికేషన్‌కు కారకుడిగా వ్యవహరిస్తాడు. అందుకే బుధుడు తన రాశిని మార్చినప్పుడల్లా, మన ఆలోచనా విధానం, నిర్ణయాలు తీసుకునే శైలి, సంభాషణలపై దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది.

ఫిబ్రవరి 3వ తేదీన బుధుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య ప్రకారం కుంభ రాశిని కొత్త ఆలోచనలు, విశాల దృక్పథం, పురోగతికి చిహ్నంగా పరిగణిస్తారు. బుధుడు కుంభ రాశిలో సంచరించడం వల్ల అనేక రాశుల వారికి కొత్త ఆరంభాలు లభిస్తాయి.

గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. మానసిక స్పష్టత పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యంగా 5 రాశుల వారికి ఈ గోచారం ఆశ్చర్యకరమైన శుభ ఫలితాలను ఇవ్వనుంది. ఆ రాశుల వివరాలు గమనిస్తే..

26
మేష రాశి

మేష రాశి వారికి కుంభ రాశిలో బుధుడి సంచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం మీ కెరీర్ గ్రోత్‌కు, నెట్‌వర్కింగ్ పెంచుకోవడానికి, కొత్త పరిచయాలకు చాలా బాగుంటుంది.

ఉద్యోగంలో, పని ప్రదేశంలో మీ ఆలోచనా విధానానికి ప్రశంసలు లభిస్తాయి. మీ టీమ్ లో మంచి సమన్వయం ఏర్పడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. స్నేహితుల సహకారంతో ఏదైనా పెద్ద అవకాశం మీ చేతికి అందే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో కూడా నెమ్మదిగా సానుకూల మార్పులు కనిపిస్తాయి.

36
మిథున రాశి

బుధుడు మీ రాశికి అధిపతి కాబట్టి, ఈ గోచారం మీకు చాలా ప్రత్యేకమైనది. కుంభ రాశిలో బుధుడి సంచారం మీ ఆలోచనలకు పదును పెడుతుంది. ఇది మిమ్మల్ని కొత్త ఐడియాల వైపు నడిపిస్తుంది.

చదువు, పరిశోధన, మీడియా, రచన లేదా కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారికి ఇది అద్భుతమైన సమయం. విదేశాలకు సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు లేదా విద్యకు సంబంధించి ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది.

46
సింహ రాశి

సింహ రాశి వారికి ఈ గోచారం సంబంధాలు, భాగస్వామ్య వ్యాపారాలలో మార్పులు తీసుకువస్తుంది. బిజినెస్ పార్ట్‌నర్‌షిప్‌లో కొత్త ప్రతిపాదనలు రావచ్చు. పాత మనస్పర్థలు తొలగిపోయే అవకాశం ఉంది.

దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య సంభాషణ బాగుంటుంది. ఉద్యోగంలో మీకు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు, ఇవి దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ఏదైనా డీల్ కోసం ఎదురుచూస్తుంటే, అది ఇప్పుడు ఖరారయ్యే అవకాశం ఉంది.

56
తులా రాశి

తులా రాశి వారికి బుధుడి సంచారం సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కళలు, మీడియా, డిజైన్, వినోదం లేదా విద్య రంగాలలో ఉన్నవారికి విశేష లాభాలు కలుగుతాయి.

ప్రేమ సంబంధాలలో స్పష్టత వస్తుంది. మీ భావాలను వ్యక్తపరచడం ఇప్పుడు సులభం అవుతుంది. సంతానానికి సంబంధించి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు ఆచి తూచి తీసుకోవాలి, కానీ మొత్తం మీద ఫలితాలు సానుకూలంగానే ఉన్నాయి.

66
కుంభ రాశి

బుధుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి, దీని ప్రభావం మీపైనే ఎక్కువగా ఉంటుంది. మీ ఆలోచనలు, మాటతీరు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలో గొప్ప మెరుగుదల కనిపిస్తుంది.

జీవితంలో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న వారికి ఇప్పుడు సరైన దిశ దొరుకుతుంది. కెరీర్‌లో కొత్త ఆరంభాలు, ఇంటర్వ్యూలు లేదా ప్రమోషన్ యోగం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాటలతో నలుగురినీ ఆకట్టుకుంటారు. 

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం, ప‌లువురు పండితులు తెలిపిన విష‌యాల ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Read more Photos on
click me!

Recommended Stories